ప్లాస్టిక్ నిషేధంపై ఢిల్లీలో అవగాహన

Tue,November 5, 2019 03:48 AM

-పాల్గొన్న కలెక్టర్ నారాయణరెడ్డి
ములుగు, నమస్తేతెలంగాణ: ములుగు జిల్లాలో చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ అమలు విధి విధానాలను జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధంపై నియమించిన పార్లమెంటరీ సభార్డినేట్ లెజిస్ట్రేచర్ కమిటీకి సోమవారం కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా తీసుకున్న వినూత్న కార్యక్రమాలైన కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియం కార్యక్రమాన్ని జిల్లాలో అమలు పర్చిన విధానాన్ని సైతం తెలియజేశారు. వినూత్న ఆలోచనలతో ప్లాస్టిక్ నిషేధానికి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలను పార్లమెంటరీ సభ్యులు అభినందించారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles