సాంకేతికత వైపు పయణించి చదువులో ముందుకు సాగాలని

Mon,November 4, 2019 02:57 AM

ములుగురూరల్, నవంబర్ 03 : విద్యార్థులు సాంకేతికత వైపు పయణించి చదువులో ముందుకు సాగాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఈ శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని అరవింద విద్యామందిర్ పాఠశాలలో టీటా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సందీప్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీరమల్ల ప్రకాశ్ డీఈవో రాజీవ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటా బృందం సభ్యులు జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పర్యటనలో విద్యార్థులకు అందించిన శిక్షణ వివరాలతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, వసతులను వీరమల్ల ప్రకాశ్, డీఈవోకు వివరించారు. అనంతరం వీరమల్ల ప్రకాశ్ మాట్లాడుతూ.. డిజిథాన్ డిజిటల్ యాత్రలో భాగంగా జిల్లాలోని 93 పాఠశాలల్లో 110 మంది టీటా సభ్యులు సందర్శించి విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.

మిగతా విద్యార్థులు రెండు రోజులుగా సాగిన శిక్షణలో నేర్చుకున్న వారిని అనుసరించాలన్నారు. టెక్నాలజీ పరంగా విద్యార్థుల్లో అవగాహన పెరగాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను సైతం పరిష్కరించడంలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టి సారించాలన్నారు. డీఈవో రాజీవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 93 ప్రభుత్వ పాఠశాలల్లో టీటా సభ్యులు ఒకొక్కక్కరు తమ తమ ల్యాప్‌ట్యాప్‌లతో హాజరై విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ-మెయిల్, ఫ్యాక్స్, ప్రభుత్వ మెయిల్స్, నోటిఫికేషన్ తదితర టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తాను వెంకటాపూర్(నూగూరు), ఏటూరునాగారం పాఠశాలలను సందర్శించిన క్రమంలో విద్యార్థులు సైతం డిజిదాన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కాగా, వెంటాపురం(నూగూరు)లో జెడ్పీటీసీ చేతుల మీదుగా విద్యార్థులకు డిజిథాన్ అవార్డులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీటా సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles