కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పీసీసీఎఫ్ శోభ

Mon,October 21, 2019 04:56 AM

మహదేవపూర్/కాళేశ్వరం, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మా ణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్, లక్ష్మీ పంప్‌హౌస్‌ను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్ శోభ, సీ ఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి ఐఎఫ్‌ఎస్‌తో కలిసి ఆదివారం సందర్శించా రు. బరాజ్‌లో కలియతిరుగుతూ నిర్మాణాలను పరిశీలించారు. బరాజ్ ఆవశ్యకతతోపాటు సంబంధిత వివరాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పర్యటించినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ వెంకటరమణారెడ్డి వెల్లడించారు. కాగా, లక్ష్మీపంప్‌హౌస్‌కు వచ్చిన వీరికి ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం పంప్‌హౌస్ వ్యూ పాయింట్ వద్ద మ్యాప్ ద్వారా ఈఎన్‌సీ వివరించారు. వ్యూ పాయింట్ నుంచి పంప్‌హౌస్‌ను, లిఫ్ట్ సాయంతో కిందకు దిగి కంట్రోల్ రూంను పరిశీలించారు.అనంరతం కాళేశ్వరంలోని ముక్తివనంను సందర్శించారు. వీరి వెంట సీసీఎఫ్ అక్బర్, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, ఈఈ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles