రామప్పలో పర్యాటకుల కోలాహలం

Mon,October 21, 2019 04:55 AM

వెంకటాపూర్, అక్టోబర్ 20 : కాకతీయుల కళాదర్పణమైన రామప్ప దే వాలయాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రామప్ప దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవుదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు ముందుగా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామప్ప శిల్పాకళ సౌందర్యాన్ని కనులారా వీక్షించి కాకతీయుల కాళాదర్పణానికి మైమరిచిపోయా రు. అనంతరం రామప్ప దేవాలయ విశిష్టతను గైడ్లు గోరంట్ల విజయ్‌కుమార్, తాడబోయిన వెంకటేశ్‌లు పర్యాటకులకు వివరించారు. రామప్ప సరస్సుకు చేరుకుని బోటింగ్ చేస్తూ రామప్ప అందాలకు ఫిదా అయ్యారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles