మేడారంలో భక్త్తుల సందడి

Mon,October 21, 2019 04:55 AM

తాడ్వాయి, అక్టోబర్ 20 : వరాలిచ్చే ఆదిదేవతలు మే డారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒ రిస్సా రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు ప్రైవేట్ వా హనాలలో అధికసంఖ్యలో తరలివచ్చారు. మొదటగా జం పన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వా గు ఒడ్డున గల జంపన్నగద్దెకు, నాగులమ్మల గద్దెలకు ప్రత్యే క పూజలు చేశారు. అక్కడి నుంచి తల్లుల గద్దెల వద్దకు చే రుకొని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూ లు, పండ్లు సమర్పించి గిరిజన సాంప్రదాయ పద్ధతులలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లు సమర్పించి గద్దెల పరిసరాలతోపాటు చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చెట్ల కింద విడిదిచేసి వంటలు చేసుకొని బంధు మిత్రులు, కుటుంబ సమేతంగా విందు భోజనాలు చేశారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles