రైట్..రైట్

Sun,October 20, 2019 04:09 AM

-జాగ్రత్తలన్నీ తీసుకున్నాం
-ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు
-ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం
-రవాణా సమస్య తలెత్తకుండా చూస్తున్నాం
-నమస్తే తెలంగాణతో జిల్లా రవాణాధికారి పి వేణు ముఖాముఖి
జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలుగకుండా రవాణా పరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతంగా వారివారి గమ్యాలకు చేరవేస్తున్నాం. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై శనివారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సకల చర్యలు తీసుకున్నాం. ఎక్కడ సమస్య తలెత్తినా తమ దృష్టికి వచ్చిన వెంటనే వెళ్లి పరిష్కరిస్తున్నాం అని జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) పీ వేణు చెప్పారు. శనివారం ఆయన ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికులకు సత్వర సేవలు, తదితర విషయాలపై నమస్తే తెలంగాణతో సుదీర్ఘంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి జిల్లా(భూపాలపల్లి, ములుగు)లో అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించామని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు కూడా రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విజయవంతంగా రవాణా వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పారు. దీనికిగాను ఎప్పటికప్పుడు భూపాలపల్లి, ములుగు జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడి వారి ఆదేశాలతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి అందుతున్న సూచనలు, ఆదేశాలను పాటిస్తూ 14రోజులుగా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలో ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు కూడా ముఖ్యభూమికను పోషిస్తున్నాయని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అందుకున్న తాము డ్రైవర్ల ఎంపికలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. డ్రైవర్ల లైసెన్స్‌లను పరిశీలించడంతోపాటు ఉదయాన్నే బ్రీతింగ్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించిన తర్వాతే డ్రైవింగ్ బాధ్యతలను అప్పగిస్తున్నామన్నారు.

ప్రతిరోజు ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే అవసరానికి మించి ప్రత్యామ్నాయంగా మరింత మంది డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఇక గ్యారేజీతోపాటు టైర్ రిట్రెడింగ్, బస్సుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా శిక్షణ పొందిన వా రికి బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పా రు. ఇక మొత్తం ఉమ్మడి జయశంకర్ భూపాలప ల్లి, ములుగు జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో గల ఆ టోలు, క్రూజర్లు, టాటా మ్యాజిక్‌లతోపాటు ప్ర యాణికులను చేరవేసే అన్ని వాహనాల వివరాల ను, గ్రామాల వారీగా రూట్లను సేకరించామని తె లిపారు. ప్రతీ డ్రైవర్ బండి నంబర్, వివరాలు, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకొని ప్ర యాణికుల డిమాండ్ మేరకు వాటిని నడిపించేలా చూస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా రెండు జిల్లాల్లో ఎక్కడ కూడా ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేయకుండా ఉండేందుకుగా ను గట్టి నిఘా వేశామని చెప్పారు. దీనిలో భాగంగానే తాము ఆకస్మి క తనిఖీలను నిర్వహిస్తూ ప్ర యాణికులతో ఇం ప్రాక్ట్ అవుతున్నామని పేర్కొన్నారు. దీంతో అధిక చార్జీ ల వసూళ్లు ఈ రెండు జిల్లాల్లో ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. టోల్ ఫ్రీ నంబర్‌ను కూ డా అందుబాటులో ఉంచామని చెప్పారు. ములు గు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులో గల వాజేడు, భూ పాలపల్లి జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులో గల మహదేవపూర్ లాంటి పలు మండలాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల ను ప్రత్యక్షంగా కలిసి వారితో ముఖాముఖీ మా ట్లాడినట్లు తెలిపారు. రవాణా పరంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని వేణు వివరించారు.

మండలాల వారీగా పర్యవేక్షణ..
ప్రతి మండలంలో తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, తమ ట్రాన్స్‌పోర్ట్ విభా గం అధికారులు, సిబ్బంది సహకారంతో మినిట్ టు మినిట్ పర్యవేక్షణ జరుగుతుందని డీటీవో వేణు చెప్పారు. ఆర్టీసీకి సంబంధించి తమ పరిధిలో ఒక్క ఫిట్‌నెస్ కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేసినట్లు చెప్పా రు. మండలాల వారీగా జరుగుతున్న పర్యవేక్షణ ల మూలంగా అడ్డాల వారీగా ఆటోలు, జీపు లు, ప్రయాణికులను చేరవేసే అన్ని రకాల వాహనాలను ఆర్టీసీ ధరలకే సక్రమంగా సేవలను అందించడానికి సులభతరమైందని ఆయన తెలిపారు.

ప్రతి సర్వీస్‌లో టిమ్ విధానం..
ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్న ప్రతి సర్వీస్‌లో ఆర్థిక పరమైన అంశాలు తలెత్తకుండా ప్రతి ప్ర యాణికుడు చెల్లించే డబ్బుకు లెక్క ఉండే విధం గా, ఆ మొత్తం సంస్థకు చేరేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో టిమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు డీటీవో వేణు తెలిపారు. దీనిలో భాగంగానే అధికారులు తాత్కాలిక కండక్టర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో టిమ్ ఆపరేషన్ సులువు అయిందని తెలిపారు.

అందుబాటులో స్కూల్ బస్సులు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్ బస్సులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల బస్సులను అందుబాటులోకి తెచ్చామని డీటీవో వేణు చెప్పా రు. ఇవి కూడా ప్రతిరోజు సమయపాలనతో తిరుగుతున్నాయని చెప్పారు. ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల నుంచి వాజేడు వరకు, కాళేశ్వరం నుంచి ములుగు, రేగొండ వరకు ఎక్కడ కూడా సమస్య తలెత్తినా తమకు అందుతున్న టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజల ఫిర్యాదును స్వీకరించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో ఎక్కడ కూడా ప్రజలకు అవాంతరాలు ఎదురు కాకుండా సాఫీగా ప్రయాణం జరిగేలా అన్ని శాఖల సమిష్టి కృషితో సర్వీసులను తిప్పుతున్నామని ఆయన వివరించారు. ప్రతి బస్టాండ్‌లో బస్సులను అందుబాటులో ఉంచడం, ఆగాల్సిన స్టేజీల్లో వాటిని ఆపడం, ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ప్రకటిత టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని చెప్పారు. ఒక రాజధాని బస్సును మినహాయిస్తే సూపర్ లగ్జరీ, డీలక్స్, పల్లెవెలుగు అన్ని రకాల ఆర్టీసీ సర్వీసులతోపాటు ప్రైవేట్ స్కూల్, కళాశాలల బస్సులను, మ్యాక్స్ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని వేణు వివరించారు. ప్రభుత్వ తదుపరి ఆదేశాలు అందేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింతగా మెరుగుపరిచి ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles