ప్లాస్టిక్ భూతంపై సమరం..

Sun,October 20, 2019 04:05 AM

ములుగు, నమస్తే తెలంగాణ: కిలో ప్లాస్టిక్‌కు కిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4వ రోజు శనివారం 42 క్వింటాళ్ల 70 కేజీల ప్లాస్టిక్‌ను ప్రజలు సేకరించారు. 174 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఈ ప్లాస్టిక్‌ను అందించి సన్నబియ్యాన్ని తీసుకున్నారు. కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి వినూత్న ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు మండలంలో 7.93 క్వింటాళ్లు, వెంకటాపూర్ 4.34, గోవిందరావుపేటలో 7.58, ఎస్‌ఎస్ తాడ్వాయిలో 3.45, ఏటూరునాగారం 3.65, కన్నాయిగూడెం 1.22, మంగపేట 9.27, వాజేడు 3. 77, వెంకటాపురం(నూగూరు)లో 1. 53 క్వింటాళ్లు, మిగతా మండలాల్లో కలిపి మొత్తం 42 క్వింటాళ్ల 70 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తెలిపారు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో సేకరించిన ప్లాస్టిక్ మొత్తం 111 క్వింటాళ్ల 26 కిలోలని ఆయన వివరించారు.

లక్నవరంలో 7 క్వింటాళ్ల ప్లాస్టిక్ సేకరణ
గోవిందరావుపేట: లక్నవరం సరస్సు వద్ద 7 క్వింటాళ్ల 58 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను శనివారం సేకరించారు. జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు ఆధ్వర్యంలో సుమారు 50 మంది గోవిందరావుపేట నుంచి లక్నవరం సరస్సు వద్దకు వెళ్లారు. సరస్సు ప్రాంతంలోని పార్కింగ్ స్థలం, బోటు పాయింట్‌తో పాటుగా, సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు సేకరించారు. హరిబాబు మాట్లాడుతూ లక్నవరం సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు వాడాలని కోరారు. మండలాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సర్పంచ్‌కు అందిం చారు. ఇందులో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మరహరి భిక్షపతి, కో-ఆప్షన్ సభ్యుడు బాబర్, నాయకులు జాలిపర్తి రామారావు, కీర్తి రవి, తుమ్మల శివ, పెండెం శ్రీకాంత్, మునిగాల వెంకన్న, మల్లేశ్, రాజు, భిక్షం, రమేశ్, మోహన్‌రెడ్డి, పాపులు, రూప్‌సింగ్, రామకృష్ణ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles