భారం కాదు.. బాధ్యత..

Sat,October 19, 2019 03:18 AM

-వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించడం మన కర్తవ్యం
-భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఓ భాగం
-పిల్లలకు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే తొలి గురువులు
-పేరెంట్స్‌ను పట్టించుకోని వారిపై చేయొచ్చు
-వృద్ధుల దినోత్సవంలో కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి

ములుగు, నమస్తేతెలంగాణ : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనకు భారం కాదని, వారిని సంరక్షించడం మన బాధ్యత అని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పూర్వకాలం నుంచి కుటుంబ వ్యవస్థలో భాగంగా తల్లిదండ్రులను పోషించడం, సంస్కృతి, సంప్రదాయాలను వారి ద్వారా నేర్చుకోవడం ఉండేదన్నారు. పిల్లల కు నాయినమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే తొలి గు రువులుగా ఉండే వారన్నారు. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను విడిచి పిల్లలు ఉద్యోగాల కోసం వేరు వేరు ప్రాం తాలకు వెళ్లే క్రమంలో వారిని పోషించడం లేదన్నారు. ఈక్రమంలో వృద్ధుల పరిరక్షణకు ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. వృద్ధుల పోషణ, సం క్షేమ చట్టం 2007 నియమావళి 2011 పై అంద రు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ చట్టం ప్రకారం తమ పిల్లలు పట్టించుకోకపోతే వృద్ధులు ఆర్డీవో, జిల్లా సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చే యవచ్చునన్నారు. అలాంటి వృద్ధులకు ప్రభు త్వం అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు.

పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులైతే తమ తల్లిదండ్రుల పోషణ అవసరాలను చూడాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నగరీకరణ వల్ల సమాజంలో కుటుంబ వ్యవస్థ క్షిణించి వృద్ధులకు కావాల్సిన సౌకర్యాలు అందించడంలో పిల్లలు విఫలమవుతున్నారనితెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరీ మాట్లాడుతూ.. జిల్లాలోని వృద్ధులకు అన్ని వసతులను వివిధ చట్టాల ప్రకారం కల్పించనున్న ట్లు తెలిపారు. వృద్ధులకు సంబంధించి వివిధ పా టలు రూపొందించడం, సంఘాలు ఏర్పాటు చే యడం వంటికి తమ శాఖ ద్వారా చేస్తామన్నారు. డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య మాట్లాడుతూ.. వృద్దాప్యం అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా చేరుకోవాల్సిన మజిలీ అని అన్నారు. ఈ వయస్సులో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన జెడ్పీటీసీ భవానీ మాట్లాడుతూ.. చిన్న తనంలో మనకు కావాల్సిన ఆవసరాలు తీర్చిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో పారిజాతం, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, బాలల సంరక్షణ అధికారి ఓంకార్, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles