ఎమ్మెల్యే గండ్రకు పీపుల్స్ లీడర్ అవార్డు

Sat,October 19, 2019 03:16 AM

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 18: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అమెరికాలోని తెలంగాణ నేతలు పీపుల్స్ లీడర్ అవార్డు అందజేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన సతీమణి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అమెరికా పర్యటనలో ఉన్నారు. కాగా, అమెరికాలోని టెక్సాస్‌లో తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (టీఏజీహెచ్) కార్యక్రమానికి ఎమ్మెల్యే రమణారెడ్డి దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, దేశానికే తలమానికమైన కాళేశ్వర ప్రాజెక్టుపై ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి వివరించారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల 42 కిలోమీటర్ల మారథాన్‌లో అవార్డు సాధించిన గండ్ర జ్యోతి తన గెలుపుపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే రమణారెడ్డికి పీపుల్స్ లీడర్ అవార్డును టీఏజీహెచ్ నేతలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీఏజీహెచ్ నేతలు వీరేందర్ దేవిరెడ్డి, జితేందర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జగపతిరెడ్డి, నరెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles