జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేయాలి

Sat,October 19, 2019 03:15 AM

-కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబర్ 18: జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమాన్ని వారం పాటు చేపట్టాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గమనించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఇండ్లు, దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అంగన్‌వాడీ కార్యాలయాలు, దవాఖానలు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాలని, కార్యక్రమంలో అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles