పోలీసుల సేవలు అభినందనీయం

Fri,October 18, 2019 03:43 AM

-అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి
-కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి
-ఎస్పీతో కలిసి చిత్రలేఖనంలో పాల్గొన్న కలెక్టర్
-ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

ములుగు, నమస్తే తెలంగాణ : విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలను అనునిత్యం కాపాడటంలో ప్రాణాలను అ ర్పించిన పోలీసుల అమరుల సేవలు అభినందనీయమని, వా రి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. ములుగు పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, కలెక్టర్ నారాయణరెడ్డిలు హాజరై విద్యార్థులతో కలిసి చిత్రలేఖనం వేశారు. అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాల పనితీరును విద్యార్థులకు ఎస్పీ వివరించారు. హెచ్‌ఎఫ్ సెల్, డీఎఫ్‌ఎం వంటి ఇతర పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రక్షణకు నిరంతరం కష్టపడుతూ సంగ విద్రోహ శక్తుల దాడుల్లో మరణించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.

ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ ప్రజల సేవకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రజల రక్షణకు తమ ప్రాణాలను అర్పించడానికి సైతం వెనుకాడమని ఎస్పీ తెలిపారు. మెరుగైన ప్రజాసేవ కోసం నూతనంగా పోలీస్‌శాఖలో ప్రవేశపెట్టిన టీఎస్ కాప్, వర్టికల్ సిస్టమ్, ఈ చాలన్ విధానం, 5ఎస్ సిస్టమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాగా, జిల్లా ఎస్పీ వేసిన చిత్రలేఖనం సమాజంలో పోలీసులు నిర్వహించే విధులను తెలిపే విధంగా గీశారు. కార్యక్రమంలో జిల్లా ఓఎస్డీ కే సురేశ్‌కుమార్, ఏఆర్ అడిషనల్ కమాండెంట్ భరత్‌కుమార్, సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి, సీసీఎస్ సీఐ సంజీవ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ తిరుపతి, ఆర్‌ఐలు స్వామి, సురేంద్ర, ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles