కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

Fri,October 18, 2019 03:41 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సింగరేణి గుర్తింపు సం ఘమైన టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. గురువారం బాయిబాటలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిని సందర్శించారు. అక్క డి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గనిలో గాలి, బ్లా స్టింగ్, ఖాళీల (టబ్బుల కొరత) సమస్య ఉందని కార్మికులు తిరుపతి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి స త్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుప తి వెంట టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ నాయకులు జగత్‌రావు, టీబీజీకేఎస్ గని ఫిట్ సెక్రటరీ రాం చందర్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాము, నాయకులు నారాయణ, రవీందర్‌రెడ్డి ఉన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles