నేడు, రేపు రామగిరి రద్దు

Thu,October 17, 2019 03:15 AM

కాజీపేట, అక్టోబర్ 16 : కాజీపేట రైల్వే జంక్షన్, టౌన్ స్టేషన్‌ల మీదుగా నడిచే రామగిరి ప్యాసింజర్ రైళ్లను గురు, శుక్రవారాల్లో రద్దు, సింగరేణి రైలును కుదించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్ డివిజన్ పరిధిలో కా జీపేట రైల్వే జంక్షన్- బల్లార్షా మార్గంలోని 325 కిలో మీటర్ వద్దనున్న రైల్వే బ్రిడ్జి మరమ్మతులను రైల్వే శాఖ చేపడుతున్నదని చెప్పారు. దీంతో రామగిరి ప్యాసింజర్ రైళ్ల రద్దు, బల్లార్షా- భద్రాచలం రోడ్ మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా -వరంగల్ రైల్వే స్టేషన్‌ల మధ్య రద్దు చేసి వరంగల్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు కుదించి నడుపుతున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా న్యూఢిల్లీ- తిరువనంతపురం కేరళ సూపర్ ఫాస్ట్ రైలు అరగంట, యశ్వంతపూర్-గోరఖ్‌పూర్‌ల మధ్య నడిచే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నలభై నిముషాల ఆలస్యంతో నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం నుంచి యథాతధంగా నడుస్తాయన్నారు. గు రు, శుక్రవారాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించి సహకరించాలని కోరారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles