మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసిన ఎంపీటీసీలు

Thu,October 17, 2019 03:14 AM

ములుగు రూరల్, అక్టోబర్ 16: ములుగు జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హన్మకొండలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించినట్లు ఎంపీటీసీలు తెలిపారు. సమస్యలపై స్పందించిన మంత్రి మండలాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసిన వారిలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్, ఎంపీటీసీలు దేవరనేని స్వామిరావు, మాసిపెద్ది పుషమ్మ సత్యం, నూనావత్ మహేశ్, జన్నారపు శ్రీనివాస్, ఆరెందుల రాధిక కుమార్, పూజారి రమాదేవి శ్రీనివాస్, జాటోత్ లాల్‌సింగ్, సుజాత రాజు ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles