తెలంగాణలో మహిళా సంఘాలు భేష్

Tue,October 15, 2019 03:38 AM

ఎల్కతుర్తి: తెలంగాణలోని మహిళా సంఘాల పని తీరు బాగుందని మహారాష్ట్ర మహిళా సంఘాల సభ్యులు కితాబిచ్చారు. మహారాష్ట్రంలోని జాల్నా, యావత్‌మాల్ జిల్లాలకు చెందిన 26మంది మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో కూడిన బృందం సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రానికి వచ్చింది. మహారాష్ట్రలో ఇటీవలే మహిళా సంఘాలను ఏర్పాటు చేయగా, తెలంగాణకు చెందిన పలువురు సీఆర్పీలు అక్కడికి వెళ్లి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణలో సంఘాలు ఎలా బలోపేతం అయ్యాయనే విషయంపై అధ్యయనం చేసేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా వారు సంఘాల ఏర్పాటు, జమలు, చెల్లింపులు, పొదుపులు, సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న సాయం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాల్లో సంఘం మహిళల భాగస్వామ్యంపై చర్చించారు. ఇక్కడి మహిళా సంఘాల పనితీరు బాగుందని, తమ సంఘాల బలోపేతానికి తాము నేర్చుకున్న విషయాలు దోహదం చేస్తాయని వారు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు అనిల్, భవానీ, ఏపీఎం రవీందర్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles