పరిస్థితిని సమీక్షించిన ఇన్‌చార్జి ఎస్పీ

Tue,October 15, 2019 03:37 AM

జిల్లాలోని పరిస్థితులపై జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అధికారులతో సమీక్షించారు. ఇంతకు ముందున్న ఎస్పీ ఆర్ భాస్కరన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సూర్యాపేటకు బదిలీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలో మొదటిసారి సోమవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్ జీ పాటిల్ ఎస్పీ కార్యాలయంలో స్థానిక అధికారులతో సమావేశమై జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయమై అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం ఏఎస్పీ సాయిచైతన్య, డీఎస్పీ కిరణ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. తరువాత జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణ పనులను ఇన్‌చార్జి ఎస్పీ పరిశీలించారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles