ప్లాస్టిక్‌పై యుద్ధం!

Sun,October 13, 2019 01:56 AM

- అభయారణ్యంలో వినియోగం నిషేధం
- ఏటూరునాగారం పరిధిలో అమలుకు సన్నాహాలు
- ఎకో టూరిజం ప్రాంతాల్లో పటిష్టంగా అమలు
- ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర నిర్వహణపై దృష్టి
- వైల్డ్‌లైఫ్‌ సెక్షన్‌ 30 ప్రకారం చర్యలు
- భారీ జరిమానాల విధింపు

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : పర్యావరణ కాలుష్యానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగా అభయారణ్యాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇందుకు సంబంధించిన చర్యలను చేపట్టేందకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రకృతి, పర్యావరణం, వన్య ప్రాణులకు ప్రాణహా ని తలపెట్టే ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేసేందుకు వైల్డ్‌ లైఫ్‌ సెక్షన్‌ 38 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ స్థాయిలో జరిమానాలు విధించనుంది. ములుగు జిల్లా ఏటూర్‌నాగారం అభయారణ్యం పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం ఇటీవల అటవీ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించింది. జిల్లా పరిధిలోని ఏటూర్‌నాగారం, తాడ్వాయి, పస్రా రేంజ్‌ల్లో ఏటూర్‌నాగారం, అభయారణ్యం, తాడ్వాయి, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అదే విధంగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రామ ప్ప దేవాలయం, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు ఎకో టూరిజం ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. వాజేడు మండలంలోని బొగత జలపాతం సైతం టూరిజం ప్రాంతంగా అటవీ ప్రాంతంలోనే ఉండడంతో ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలతోపాటు జరిమానాలు విధించి అభయారణ్యాలను, వన్య ప్రాణుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు నడుం బిగించింది. తాడ్వాయి మండలం మేడారం సమ్మ క్క సారలమ్మ జాతర సైతం ఏటూర్‌నాగారం అభయారణ్యంతోపాటు, బయ్యక్కపేట, వైల్డ్‌ లైఫ్‌ కేంద్రంగా ఉండడంతో జాత ర సమయంతోపాటు ఇతర సమయంలో కూడా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించేందకు ఆదేశాలను జారీ చేసింది.

నాలుగు మండలాల పరిధిలో అభయారణ్యం..
ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం, తాడ్వాయి , కన్నాయిగూడెం, గోవిందరావుపేట మండలాల్లో ఏటూర్‌నాగారం అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, పర్యాటక, ఎకో టూరిజం ప్రాంతాలతో పాటు చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఆదేశాల మేరకు అధికారులు అభయారణ్యం ప్రాంతంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్లాస్టిక్‌ వినియోగంపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌కు అనుమతి లేదు
అభయారణ్యంలో ప్లాస్టిక్‌ను వినియోగించిన పర్యాటకులకు ముందు సూచనలిచ్చి వారి వద్ద నుంచి ప్లాస్టిక్‌ వస్తులను సేకరిస్తారు. అనంతరం వారికి అందుకు సరిపడ జూట్‌ సంచులు అందజేసి కొద్దిపాటి రుసుములు వసూలు చేస్తారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌తోపాటు ప్లాస్టిక్‌ బాటిళ్లను అనుమతించే అవకాశాలు ఉండవని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభయారణ్యాలలో భోజనాలు చేసే వారు తాము వాడిన ప్లాస్టిక్‌ ఇస్తార్లను వదిలి వేయకుండా వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనున్నారు.

పర్యావరణ ప్రేమికుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం
అభయారణ్యంలో ప్లాస్టిక్‌ వాడకం వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు అడవుల్లో వదిలేసే ప్లాస్టిక్‌ను తిన డం వలన అటవీ జంతువులు చాలా వరకు ప్రాణాలను కోల్పోతున్నాయని పర్యావరణ ప్రేమికుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఇప్పటికే అభయారణ్యంతోపాటు పార్కులు, ఎకో టూరిజం ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతోపాటు జరిమానాలు విధిస్తూ ప్లాస్టిక్‌ నిషేధంలో విజయం సాధించారని చెప్పవచ్చు.

మేడారంలో ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రత్యేక కార్యాచరణ
ములుగు జిల్లా పస్రా రేంజ్‌ పరిధిలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించకుండా అధికార యంత్రాంగం ప్రత్యే క కార్యాచరణ రూపొందించునున్నారు. మహా జాతరలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని కట్టడి చేయగలిగితే ఏటూర్‌నాగారం అభయారణ్యంతోపాటు తాడ్వాయి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రా లు, లక్నవరం ఎకో టూరిజం ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పటిష్టంగా నిషేధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles