నాలుగు రోజులు..169 దరఖాస్తులు

Sun,October 13, 2019 01:54 AM

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 12 : ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నాలుగు రోజుల్లో మద్యం షాపులకు 169దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో 55మద్యం షాపులు ఉండగా, భూపాలపల్లి పట్టణానికి చెందిన రెండు షాపులను ఖమ్మంకు తరలించారు. దీంతో 53మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. 53 షాపులకుగాను 46షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మరో ఏడు షాపులకు ఇంతవరకు దరఖాస్తులు రాలేదు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో 17ఏజెన్సీ మద్యం షాపులు ఉండగా, ఈ ఏడు వాటి సంఖ్యను ఏడుకు కుదించారు. మొత్తం 53మద్యం షాపులకు 169 దరఖాస్తులు రాగా ఈ నెల 16 చివరి రోజు అధిక సంఖ్య లో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న భూపాలపల్లి పట్టణంలోని 1000క్వార్టర్లలో గల సింగరేణి క మ్యూనిటీ హాల్‌లో మద్యం షాపులకు కలెక్టర్‌ వాసం వెం కటేశ్వర్లు ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో 53షాపులు..
ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి (భూపాలపల్లి, ము లుగు జిల్లాలు)జిల్లాలో 53మద్యం షాపులు ఉన్నాయి. భూపాలపల్లి ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో 15, కాటారం సర్కిల్‌ పరిధిలో 11, ములుగు సర్కిల్‌ పరిధిలో 17, ఏ టూరునాగారం సర్కిల్‌ పరిధిలో 10మద్యం షాపులు ఉన్నాయి. భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో 17మద్యం షా పులు ఉండగా, వీటిలో భూపాలపల్లి పట్టణంలోని ఆరు, తొమ్మిదో నంబర్‌ గల షాపులను షిప్టు చేశారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో షాపులు ఏడుకు తగ్గాయి.

169 దరఖాస్తులు..
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో గడిచిన నాలుగు రోజు ల్లో 169దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి ఎక్సైజ్‌ స ర్కిల్‌ పరిధిలో 52, కాటారం పరిధిలో 15, ములుగు పరిధిలో 64, ఏటూరునాగారం పరిధిలో 38దరఖాస్తులు వ చ్చాయి. మొత్తం 53షాపులకుగాను 46షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మరో ఏడు షాపులకు దరఖాస్తులు రాలే దు. శనివారం ఉమ్మడి జిల్లాలో 73దరఖాస్తులు వచ్చా యి.

ఏడు షాపులకు దరఖాస్తులు నిల్‌..
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఏడు మద్యం షాపులకు ఇప్పటి వరకు దరఖాస్తులు రాలేదు. కాటారం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో పలిమెల, గంగారం, కొయ్యూరు, తాడిచెర్ల, యామన్‌పల్లి మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదు. ఏటూరునాగారం సర్కిల్‌ పరిధిలో చించుపల్లి (షాప్‌ నెంబర్‌ 2)కు, భూపాలపల్లి పట్టణంలోని ఒక షాపుకు దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి తెలిపారు.

ములుగు జిల్లా ఏజెన్సీ పరిధిలో 17ఏజెన్సీ షాపులు ఉండగా ఇప్పుడు ఏడుకు కుదించినట్లు ఆయన తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. గత సంవత్సరం 55మద్యం షాపులకుగాను 1497దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles