నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి

Sun,October 13, 2019 01:54 AM

ఏటూరునాగారం, అక్టోబర్‌ 12 : కన్నాయిగూడెం రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ గడ్డం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పార్టీ, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు దశ దిన కర్మ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటిం చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ఏ ర్పాటు చేసిన సంతాప సభలో పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కొద్ది మంది మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని, అందులో గడ్డం వెంకటేశ్వర్లు ఒకరన్నారు. పార్టీకి ఎన్నో సేవలు చేశారన్నారు. ఉద్యమ కాలంలో ఏజెన్సీలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. పోరాట ఫలితాలు అందుతున్నాయని, ఉద్యమ కారులకు న్యాయం జరిగే విధం గా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటామన్నారు. తాను ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గడ్డం వెంకటేశ్వర్లు ఉద్యమంలో చురుగ్గా పనిచేశారన్నారు. వెంకటేశ్వర్లు కుటుంబ విషయం సీఎం కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. హుజూర్‌ నగర్‌ ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌తో కలసి చర్చించి ఆర్థికంగా ఆదుకునే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

వెంకటేశ్వర్లుకు మాజీ మంత్రి చందులాల్‌ నివాళి
గడ్డం వెంకటేశ్వర్లు మృతి విషయం తెలుసుకున్న మాజీ మం త్రి చందులాల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజ్మీరా ప్రహ్లాద్‌ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయ న చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి చందులాల్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిక్కుల్ల సమ్మక్క, సర్వ ముత్తయ్య, బొగ్గుల శ్రీను కుటుంబాలను ప్రహ్లాద్‌ పరామర్శించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య, ఎంపీపీ అంతటి విజయ, మండల కో ఆర్డినేటర్‌ ఆకుల సాంబయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌ కుమార్‌, నాయకులు నూతి కృష్ణమూర్తి, తుమ్మ మల్లారెడ్డి, గోవిందు నాయక్‌, సర్దార్‌ పాషా, సప్పిడి రాంనర్సయ్య, కూనూరు అశోక్‌, బెడిక రమేశ్‌, ఎంపీటీసీ భరత్‌, శివాలయం కమిటీ చైర్మన్‌ తాడూరి రఘు, పెండ్యాల ప్రభాకర్‌, కంకనాల రమేశ్‌, పర్వతాల రమేశ్‌, అల్లి శ్రీను, బట్టు కొంరయ్య, మేరుగు వెంకటేశ్వర్లు, కనకతార, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles