రాష్ట్రస్థాయి ఖోఖోలో ఓరుగల్లు సత్తా

Sun,October 13, 2019 01:53 AM

ముప్కాల్‌ (నిజామాబాద్‌) : 39వ తెలంగాణ రాష్ట్రస్థా యి అండర్‌-18 ఖోఖో బాలబాలికల పోటీలు శనివారం ముగిశాయి. బాలుర వి భాగంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా జట్టు సత్తా చాటి విజేతగా నిలిచిం ది. బాలికల విభాగంలో రంగారెడ్డి జట్టు గెలుపొందింది. నిజామాబాద్‌ జిల్లా ము ప్కాల్‌ మండల కేం ద్రంలోని చైతన్య యూత్‌ క్లబ్‌ క్రీడా మైదానంలో 10వ తేదీన ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. శనివారం పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, విజయా లు, అపజయాలను సమానంగా తీ సుకోవాలని పిలుపునిచ్చారు. టోర్నీలో పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. టాస్‌ గెలిచిన వరంగల్‌ టీం కోర్టును ఎంచుకోవడంతో ఆట ప్రారంభమైంది. ఫైనల్‌లో బాలురు విభాగంలో వరంగల్‌, రంగారెడ్డి జట్లు తలపడగా.. వరంగల్‌ విజేతగా నిలిచింది. రెండు రౌండ్లలో రంగారెడ్డి జట్టు 16 పాయింట్లు సాధించగా.. వరంగల్‌ జట్టు 17 పాయింట్లు సాధించి పాయింట్‌ తేడాతో వరంగల్‌ గెలుపొందింది. బాలికల విభాగంలో రంగారెడ్డి, నల్గ్గొండ జట్లు తలపడగా.. రంగారెడ్డి విజేతగా నిలిచింది. రెండు రౌండ్లలో రంగారెడ్డి 9 పాయింట్లు సాధించింది. నల్గొండ 8 పాయింట్లు సాధించగా.. పాయింట్‌ ఆధిక్యంతో రంగారెడ్డి విజేతగా నిలిచింది. సెమీఫైనల్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌ బాలికల జట్లు త లపడగా.. నిజామాబాద్‌ తృతీయ స్థానంలో నిలిచింది.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles