భూపాలపల్లి డీజీఎం (పర్సనల్) రాజేంద్రకుమార్ బదిలీ

Sat,September 14, 2019 02:06 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డీజీఎం (పర్సనల్)గా పని చేస్తున్న డాక్టర్ ఎం రాజేంద్రకుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేట్ జీఎం (పర్సనల్) బసవయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎం రాజేంద్రకుమార్‌ను కొత్తగూడెం కార్పొరేట్ హెచ్‌ఆర్‌డీ విభాగానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాలో పని చేస్తున్న డీజీఎం (పర్సనల్) మంచాల శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. డీజీఎం (పర్సనల్) రాజేంద్రకుమార్ ఏరియాలో జరిగిన స్వచ్ఛ పఖ్వాడా కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించారు. అదేవిధంగా నెలనెలా క్వార్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి కార్మికులకు కేటాయించే కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles