మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Fri,August 23, 2019 04:02 AM

కృష్ణకాలనీ, ఆగస్టు 22: వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన వారవుతార ని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆర్ భాస్కరన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. మరో పది రోజుల్లో వి నాయక చవితి నవరా త్రి ఉత్సవాల దృష్ట్యా జిల్లాలోని గ్రామాల్లో, పట్టణా ల్లో, వాడవాడల్లో మట్టి విగ్రహాలనే నెలకొల్పాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలతో మానవులకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. మట్టితో చేసిన ప్రతిమలను పూజించడం ప్రీతి పాత్రమని పేర్కొన్నారు. పీవోపీతో చేసిన విగ్రహాలను నదులు, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, జలచరాలు అంతరిస్తాయని తెలిపారు. అన్నింటినీ కాపాడడానికి మట్టి వినాయక ప్రతిమలను నెలకొల్పాలని సూచించారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles