సాహిత్యం.. సమాజహితం


Sun,December 15, 2019 01:16 AM

-కవులకు విశాల దృక్పథం ఉండాలి
-పాత, కొత్త తరాల సాహితీవేత్తల అనుసంధానం తప్పనిసరి
-అంతర్జాతీయ సాహితీ సదస్సులో నందిని సిధాడ్డి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సాహిత్యం అంటే కేవలం రచనలు కాదని.. దానికి సమాజ హిత లక్షం ఒకటుండాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధాడ్డి అన్నారు. శనివారం అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సాహితీ సదస్సు పేరుతో పాత, కొత్త తరం కవుల అనుసంధాన కార్యక్షికమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధాడ్డి మాట్లాడుతూ సాహిత్యానికి మంచి లక్షం ఉండాలన్నారు. అలాగే కార్యక్షికమ నిర్వాహక సంస్థ అయిన ఆటా రెండు దేశాల మధ్య అనుసంధానంగా కృషి చేస్తుందన్నారు. అంతే కాకుండా భాష సంరక్షణలో భాగంగా ఆటా జరిపిన ఈ కార్యక్షికమ ముఖ్య ఉద్దేశం ముందు తరం కవులకు, ఇప్పుడు రాస్తున్న కవులను అనుసంధానం చేయాలనే సాహసోపేత నిర్ణయం అన్నారు. ఆటా లోగోలో ఆటా అక్షరాల బాట అని వారు పెట్టుకున్నారని, ఈ అక్షరాలు తెలుగు అక్షరాలని, ఈ అక్షరాలు ప్రజల సంస్కక్షుతిని ప్రతిబింబించే అక్షరాలని పేర్కొన్నారు. ఈ అక్షరాల ద్వారా ఎన్ని హృదయాలను చేరగలమో అన్ని హృదయాలను ఏకం చేయడానికి చేస్తున్న లక్షంతో ఈ కార్యక్షికమం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్నవారు కార్యక్షికమాలు నిర్వహించడమే కష్టం, అలాంటిది అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్షికమాన్ని విజయవంతంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు.

అందులోనూ పాత, కొత్త తరాల మధ్య అనుసంధానం చేయాలనుకోవడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అన్నారు. కొత్త తరం కవులు, రచయితలు పాత తరం వారి రచనలు చదవాలని, పాత తరం వారు చెబుతుంటే, వారి తరం రచనలు చదవాల్సిన అవసరం లేదు, వారి ప్రభావం మా మీద పడుతుంది అలా చదివితే అని కొత్తతరం వారు అనుకుంటున్నారని, చదవకుండా ఎలా రాస్తారు మేము జీవితాన్ని చదివి వచ్చిన వారిమి మా రచనలు చదివితేనే మీరు బాగా రాయగలరు అని పాత తరం వాదన అని అన్నారు. అయితే ఈ రెండు తరాల వాదనలను ఒక అనుసంధానం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆటా భావించిందని నందిని సిధాడ్డి తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య పరిపాలన నుంచి సాహిత్యం అనే కాకుండా అనేక విషయాల్లో ఇప్పుడు సరిపోల్చుకుంటున్నాయని, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా అనుసంధానం అవసరమేనని అన్నారు. ఆంగ్ల భాష ముందుకొస్తున్న తరుణంలో రెండు రాష్ట్రాల్లో తెలుగు భాష పట్ల అనేక చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్యక్షికమంలో ఇరు రాష్ట్రాల భాషా విషయాల్లో కూడా పలు తేడాలున్నందున అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందన్నారు. పాత తరం పుస్తకాలను కొత్త తరాలు చదవడం వల్ల కొంత మార్గదర్శకాలు తీసుకునే, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అదే సమయంలో సాహిత్య దృక్పథం, సాహిత్య ప్రయోజనం అనే అంశాలకు నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం నుంచి పూర్వం సాహిత్యం వల్ల ప్రయోజనం లేకుండా ఉందని ఎప్పుడూ భావించలేదు. సాహిత్యానికి జనబాహుళ్యం యెక్క శ్రేయస్సును ఆకర్శించే లక్షంగా సాహిత్యాన్ని భావించిన రోజుల నుంచి వచ్చాం అని, నేడు సాహిత్యం ప్రయోజనమంటే కేవలం సత్కారాలు, శాలువాల కోసమే అన్నట్టుగా మారిందన్నారు. మరో వైపు రికార్డుల కోసం మాత్రమే నేడు సాహిత్య కార్యక్షికమాలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలు పాత తరంలో ఎక్కడా చూడలేదన్నారు. మరో వైపు కొంత సమయం ఇచ్చి ఒక అంశంపై కవిత్వాలు రాయడం వంటి పోటీలు కనపడుతున్నాయని, ఇవన్నీ కేవలం సాహిత్య అస్థిత్వం కోసం అన్నట్లు మాత్రమే ఉందన్నారు. కానీ గతంలో సాహిత్యానికి మన సాహిత్యం వల్ల నలుగురికి మంచి జరగాలన్న దృక్పథం ఉండేదన్నారు. కానీ నేడు దృక్పథం లేని సాహిత్యాన్ని మనం చూస్తున్నాం, సాహిత్యానికి తప్పక దృక్పథం ఉండాలన్నారు. ఇటువంటి చర్చల వల్ల సాహిత్యానికి మేలు జరుగుతుందన్నారు.

అనంతరం అతిథిగా హాజరైన సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత కే.శివాడ్డి మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇంగ్లిష్ మాస్టారునైన నేను నేటి యువతకు పాఠాలు చెబుతూ అనుసంధానం అయ్యేందుకే ఇంకా అధ్యాపకుడిగా కొనసాగుతున్నానన్నారు. నేటి తరం వారితో పాత తరం వారు అనుసంధానం అవడం అనేది చాలా ముఖ్యమన్నారు. జీవితంలో ఎంత అనుభవమున్నా నేర్చుకోవడం అనేది ఆగిపోదన్నారు. నేర్చుకోవడమనేది నిరంతర జీవిత ప్రక్రియ అన్నారు. చదువు రాదు, ఇంగ్లిషు రాదు అనుకున్న నేను ఆంగ్ల అధ్యాపకున్ని అయ్యానని అన్నారు. అలాగే తనకు చదువుకునేప్పుడు డిగ్రీ వచ్చే వరకూ ఎక్కువ స్థాయిలో ఇంగ్లిష్‌తో సరైన సంబంధమూ లేదన్నారు. మనం ఒక కవిత్వం లేదా రచన చేసేప్పుడు దాన్ని చదివే వ్యక్తి అన్వయించుకునేలా లేకపోతే అది వారికి నచ్చదన్నారు. అనుసంధానం కూడా అలాగే రచనకు పాఠకునికి మధ్య ఉండాలన్నారు. ముందు తరం రచనలను చదవకూడదనుకున్న వారు అలాంటి అపోహలను పక్కన పెట్టాలన్నారు. ఆ తరం ప్రభావితం చేస్తుందనుకోవడం కంటే వాటిని చదవడం వల్ల మనం జాగ్రత్తలు నేర్చుకొనే అవకాశం ఉందని తెలుసుకోవాలని కొత్త తరం వారికి సూచించారు. అంతే కాకుండా కొత్త తరాల మీద మనకు ఉన్న కొన్ని అపోహలు అపనమ్మకాలేనని అన్నారు.

ఇతరులపై నమ్మకం ఉంచినప్పుడు అది నమ్మకమైన కొనసాగింపు వస్తుందని, మీ వ్యక్తిత్వం మెరుగుపడాలంటే మీకు మీరే రోల్ మోడల్‌గా తయారవ్వాలని, ప్రతీ రచయిత, కవి తర్వాత తరాలకు రోల్ మోడల్‌ను సృష్టించాలన్నారు. ఇటువంటి కార్యక్షికమాలు ఒకరికొకరిని దగ్గర చేసి ఒకరికొకరు స్ఫూర్తినిచ్చేందుకు ఉపయోగపడుతాయన్నారు. అనంతరం ఆచార్య కసిడ్డి వెంకటడ్డి మాట్లాడుతూ నలుగురితో చర్చలు జరిపినపుడే ఆలోచనలు వికసిస్తాయన్నారు. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయన్నారు. ఎవరి ఆచరనలు అనుసరించే విధంగా ఉంటాయో వారి మార్గాలను మనం అనుసరిస్తామన్నారు. ఎవరి అనుభవాల మాటలమూట మన వద్దకు చేరుతుందో ఆ మూటను మనం విప్పి అందులో సుగుణాలను నేర్చుకుంటామన్నారు. సమాజంలో సాహిత్యానికి ఒక గొప్ప శక్తి ఉందని సమాజంలోని అనేక అగాఘిత్యాలకు సాహిత్యం అడ్డుగా నిలబడుతుందన్నారు.

ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు, అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు వారధిగా ఆటా ఉంటుందని అన్నారు. పాత తరం కవులకు, నవతరం కవులకు, రచయితలకు అనుసంధాన కార్యక్షికమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి కార్యక్షికమాల వల్ల సాహిత్యానికి చేయూతనివ్వడమే తమ ఉద్దేశమన్నారు. కార్యక్షికమంలో ప్రముఖ కవులు, రచయితలు రాచపాళెం, కె. శ్రీనివాస్, ఓల్గా, అప్సర్, చంద్రశేఖర్ రెడ్డి, ఆటా అధ్యక్షులు పరమేశ్, భీంరెడ్డిలు పాల్గొన్నారు. అలాగే దేశపతి శ్రీనివాస్, అనంత్ శ్రీరాం, ప్రొద్దుటూరి ఎల్లాడ్డిల ఆధ్వర్యంలో ‘పద్యం, పాట, జానపదం’ కార్యక్షికమం జరిగింది. అనుభవాలు కార్యక్షికమంలో కేఎన్ మల్లీశ్వరీ, వెల్లండి శ్రీధర్, పూడూరి రాజిడ్డి, వెంకట సిద్దాడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిడ్డి, స్వాతికుమారి పాల్గొన్నారు. ఆటా సభ్యులు అనిల్ బోదిడ్డి, రామకృష్ణాడ్డి, నరసింహాడ్డితో పాటు 20 మంది ఆటా సభ్యులు ప్రతినిధులుగా పాల్గొన్నారు. 39 మంది నేటి తరం కవులతో అంతర్జాతీయ సాహితీ సదస్సు జరగడం ఇదే మొదటిసారి.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...