జనవరి 8న జాతీయ సమ్మెను విజయవంతం చేయండి


Sun,December 15, 2019 01:13 AM

- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత
చర్లపల్లి: దేశంలో కార్మిక చట్టాలు నీరుగారిపొతున్నాయని, కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న విధానాలతో కార్మికులు, సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత అన్నారు. శనివారం సీఐటీ యూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా ఏఎస్‌రావునగర్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా మీదుగా కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ఎగ్జిబిషేన్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల ఆదీనంలో దేశ పాలన సాగుతుందని, కార్మికుల హక్కులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జనవరి 8వ తేదీన నిర్వహించే జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని ఆమె పిలుపున్చిరు. జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్, సభ అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబులు ప్రసగించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు రమ, భూపాల్, జయలక్ష్మి, రాజబాబు, మల్లిఖార్జున్, మేడ్చల్ సీఐటీయూ అధ్యక్ష, కార్య దర్శులు ఆశోక్, చంద్రశేఖర్, వెంకట్, శ్రీనివాసులతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నాపరు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...