అయ్యప్ప ఆలయంలో మంత్రి మల్లారెడ్డి పూజలు


Fri,December 13, 2019 01:57 AM

ఘట్‌కేసర్‌: అన్నోజిగూడ శ్రీ ఆంజనేయ షిర్డీసాయి అయ్యప్పస్వామి ఆలయంలో మహా పుష్కర కుంభాభిషేక మహోత్సవ పూజలు గురువారం జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిఖరంపై ధ్వజ మహాకుంభాభిషేకాన్ని చంద్రమౌళి గురుస్వామి నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ధర్మకర్త బాలగోని వెంకటేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజోత్సవాలు జరిగా యి. ఆలయ నిర్వహకులు మంత్రి మల్లారెడ్డితోపాటు రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, బద్ధం జగన్‌మోహన్‌రెడ్డి, బాలగోని వెంకటేశ్‌ గౌడ్‌, బాలగోని బాల్‌రాజ్‌గౌడ్‌, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చంద్రమౌళి వెంకటేశ్‌ శర్మ, రఘుపతి శర్మ, మాజీ సర్పంచ్‌ చిన్న నర్సింహులుగౌడ్‌, గాంధారి లక్ష్మీనారాయణ, శంకర్‌గౌడ్‌, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...