14 నుంచి కాపు వెంకటరఘు ఫొటో ఎగ్జిబిషన్‌


Fri,December 13, 2019 01:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలోని వారసత్వ సంపదలైన కట్టడాల ను ఫొటోలు తీయడం కాపు వెంకటరఘుకు ఎంతో ఆసక్తి ఉండేది. జేఎన్టీ యూ హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్‌, ఫొటోగ్రఫీలో తన విద్యాభ్యాసాన్ని చేసిన రఘు తర్వాత రెండింట్లోనూ ఇష్టంగా పని చేశారు. ఫొటోగ్రఫీపై ఉన్న అమితాసక్తితో రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాచీన కట్టడాలు, గొప్ప వారసత్వ సంపద అయిన అనేక ప్రదేశాలను తన కెమెరాలో బంధించారు. సామాజిక స్పృహ ఉన్న రఘు అనేక సామాజిక అంశాలతో ముడిపడి ఉన్న అంశాలను కూడా తన ఫొటోలతో దాచేవాడు. ఇదే క్రమంలో 2010లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రఘు మృతి చెందారు. ఆయన భార్య అనురాధ ఆధ్వర్యంలో 14న ఆయనను స్మరిస్తూ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో రఘు తీసిన ఫొటోలతో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌లో రఘు తీసిన దేశ చారిత్రక అంశాలను ప్రతిబింబించే చిత్రాలను ప్రదర్శించనున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...