‘కొండా వెంకటరంగారెడ్డి జీవితం నేటి యువతకు ఆదర్శం’


Fri,December 13, 2019 01:56 AM

కవాడిగూడ: కొండా వెంకటరంగారెడ్డి జీవితం నేటి యువతకు ఆదర్శంకావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సమాచార కమిషనర్‌ దిలీప్‌రెడ్డి సూచించారు. దోమలగూడలోని ఏవీ కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దిలీప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి 129వ జయంతి వేడుకలకు జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలు కలిగిన జీవితం ప్రధానమని, పెద్దలను అనుసరించి అడుగులు వేయాలని సూచించారు. యువతకు సరైన మార్గనిర్దేశం చేసినప్పుడే ఉత్తమ పౌరులు గా ఎదుగుతారన్నారు.

ఈ సమాజం నాకేమిస్తుంది అని కాకుండా సమాజానికి నేనేం చేస్తున్నానని యువ త ప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు. సమాజంలో ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడనేది కె.వి.రంగారెడ్డి ఆచరించిన మార్గం మనకు అనేక రూపాలను చూపిస్తుందని చెప్పారు. ఒకప్పుడు విలువైన రాజకీయాలు ఉండేవి, నేటి రాజకీయాలు దిగజారిపోయాయి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నాలుగు తరాలు కూర్చుని తినేలా సంపాదిస్తున్నారన్నారు.

అప్పట్లో హుందాగా, కచ్చితంగా, స్పష్టంగా మాట్లాడే నాయకుల ఉండేవారు. ఇప్పుడు అలాంటి నాయకులు కరువయ్యారన్నారు. నిజాంకాలంలో ఉర్ధూ పాఠశాలలు ఉన్న సమయంలో మాడపాటి, సురవరం లాంటి వారితో కలసి కె.వి.రంగారెడ్డి తెలుగు విద్యాలయాలను నెలకొల్పారని గుర్తు చేశారు. చరిత్ర తెలిస్తేనే మన భవిష్యత్తుకు మార్గం దొరుకుతుందని చెప్పారు. పెండ్లి శుభకార్యాలయ సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. ఆఖర్చులు కొంత తగ్గించి మిగిలిన డబ్బులతో విద్యా, విజ్ఞాన దానం చేయాలని కోరారు. ప్రస్తుతం విద్యా, రాజకీయ విలువలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, లా కళాశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి, కరస్పాండెంట్‌ వినోద్‌రెడ్డి, పీజీ సెంటర్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ, ఏవీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజలింగం, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles