తగ్గుతున్న ‘ఉల్లి’ ఘాటు


Thu,December 12, 2019 12:38 AM

-విడుతల వారీగా నగరానికి చేరుతున్న ఉల్లి
-వచ్చేవారం రూ.100లోపే ఉంటుందని అంచనా...

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నెల రోజులుగా ఎక్కడ చూసినా చర్చంతా ఉల్లి గురించే.. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రుచినిచ్చే ఉల్లి లేకపోవడంతో సామాన్యుల కూరల్లో పెద్ద కొరత ఏర్పడింది. తక్కువస్థాయిలో ఉల్లి వస్తుండడంతో ప్రజలు మార్కెట్ల వద్ద రోజూ బారులు తీరి ఉల్లిని సాధించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అటు ప్రభుత్వం పెరుగుతున్న ఉల్లికి కల్లెంవేసేందుకు ఉన్న మార్గాలన్నిటినీ అన్వేషిస్తూనే ఉంది. సాధారణం మార్కెట్‌ సూత్రం ప్రకారం సైప్లె తగ్గినప్పుడు డిమాండ్‌ పెరిగి డిమాండ్‌తోపాటు ధర పెరుగుతుంది. ఈ ఉల్లి డిమాండుకు తగ్గట్టు సైప్లెని పెంచడం వల్ల ధరను తగ్గించే ఉద్దేశంతో ప్రభు త్వం పక్క రాష్ర్టాల నుంచి పెద్దమొత్తంలో విడుతలవారీగా నగరానికి ఉల్లి చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల నియంత్రణ చర్యల్లో తలామునకలైన అధికారుల ప్రత్యేక చొరవతో దిగుమతి అవుతున్న ఉల్లి తక్కువ ధరలకు మార్కెట్లకు చేరుతుంది. దీం తో వ్యాపారులు తమకు వచ్చే ధరకు రవాణా చార్జీలను మాత్రమే అదనంగా జత చేసి ఒక్కో కిలోకు 20 రూపాయల చొప్పున మాత్రమే ఎక్కువ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో గత వారం టోకు ధర కిలోకు రూ.180 వరకూ ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ. 90 నుంచి రూ.100లోపుకే చేరింది. గత మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ర్టాల నుంచి రోజురోజు టన్నులకొద్ది ఉల్లి నగరంలో ని మలక్‌పేట మార్కెట్‌కు చేరుతుంది. పక్క రాష్ర్టాల నుంచి గత సోమవారం దాదాపు 6, 555 క్వింటాళ్ల ఉల్లి నగరానికి చేరింది. తిరిగి మంగళవారం 11 వేల క్వింటాళ్లు, బుధవారం 9, 570 క్వింటాళ్ల ఉల్లి నగరంలోని మలక్‌పేట మార్కెట్‌కు చేరింది. దీనిని తిరిగి ఇతర మార్కెట్లకు, చిరువ్యాపారులకు అధికారులు బహిరం గ వేలం ప్రక్రియ ద్వారా అందిస్తున్నారు. దీం తో కొద్ది రోజుల్లోనే పెద్ద మార్కెట్ల నుంచి చిన్న మార్కెట్లకు తక్కువ ధరకు ఉల్లి చేరనుంది.

తగ్గుముఖం పట్టనున్న ధర
సైప్లె పెరుగుతుండడంతోపాటు టోకు అమ్మకాలను ప్రభుత్వం తక్కువ ధరలకే అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవడం వల్ల చిల్లర వ్యాపారులకు కూడా తక్కువ ధరకు ఉల్లి చేరుతుంది. దీంతో వారికి వచ్చే ధరకు రవాణా చార్జీలు, కూలీచార్జీల రూపంలో మరో రూ.20 చేర్చి అమ్మకాలు జరపనున్నారు. దీంతో ధర రిటైల్‌ మార్కెట్లో రూ.100కు ఈ వారంలో చేరనుంది. అటు తక్కువ ధరకు కొని పాత ధరలకే అమ్మకాలు చేపట్టే వ్యాపారులపై, ఉల్లి స్టాకును అడ్డగోలుగా బ్లాక్‌ చేసే వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మలక్‌పేట మార్కెట్లో బుధవారం పలికిన రేటు ప్రకారం దాదా పు రూ.9 వేలకు క్వింటాలుకు ధర పలికింది. అంటే కిలో రూ.90 రూపాయలు. ఈ ఉల్లి చిన్న మార్కెట్లకు చేరేసరికి పై ఖర్చుల నిమిత్తం కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకూ పెంచి అమ్మి నా ధర వందకు కాస్త అటూఇటుగా ఉండే అవకాశం ఉంది.

గత శుక్రవారం మలక్‌పేట మార్కెట్లో క్వింటాలుకు చిరు వ్యాపారులకు అమ్మకం జరిపిన ధర రూ.19 వేలు ఉంటే ఆ ధర సోమవారం రూ.11 వేలకు పడిపోయిం ది. అలాగే ధర పతనమవుతూ మరుసటి రోజు మంగళవారం రూ.10 వేలకు, నిన్న (బుధ వారం) రూ.9 వేలకు తగ్గింది. రోజురోజుకూ ఇతర రాష్ర్టాల నుంచి ఉల్లి నిరంతరంగా రాను న్న నేపథ్యంలో ధర మరింతగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 15వ తేదీ లేదా 16వ తేదీకి ఈజిప్టు ఉల్లి కూ డా చేరుతుందనే అంచనాలున్నాయి. దీంతో రేటు పెంచేందుకు కృత్రిమ కొరత తెచ్చే వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం ఉండడంతో వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్‌ కూడా త్వరగా బయటకు రానున్నది. దీంతో తిరిగి ఉల్లి సామాన్యులకు సాదారణ ధరలకు అందనుంది

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles