నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి


Thu,December 12, 2019 12:32 AM

బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ: మీర్‌పేట మున్సిపాలిటీ కార్పొరేషన్‌ పరిధిలో రూ.23కోట్లతో ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు ఎంతో సంతృప్తినిచ్చిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ట్రంక్‌లైన్‌ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మం త్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోవడంతో రూ.23కోట్లు కేటాయించారన్నా. దీంతో చెరువుల్లోకి మురుగునీరు పోకండా ఉంటుందన్నారు. మురుగు నీటి చెరువులను సుందరీకరణ చేస్తున్నామన్నారు.

డివిజన్‌, మున్సిపాలిటీల అభివృద్ధి
ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్లలో, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లలో, జెల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో రూ.వంద కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజల మౌలిక, డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యలను పరిష్కరించామన్నారు.కాలనీలలో దశలవారీగా అభివృద్ధి చేస్తువస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు. రోడ్ల విస్తరణకు కోట్ల రూపాయలు తీసుకరావడం జరిగిందన్నారు.

ప్రతి ఇంటికి క్రిష్ణా వాటర్‌
నియోజకవర్గవ్యాప్తంగా క్రిష్ణా వాటర్‌ పైపులైన్‌లు చివరి దశకు వచ్చాయన్నారు. ట్యాంక్‌ల నిర్మాణం పూర్తి కావస్తున్నాయని, 90శాతం పనులు పూర్తి కావడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి క్రిష్ణా వాటర్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం త్వరలోనే నేరవేరుతుందన్నారు. మార్చి నాటికి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఇంటికి క్రిష్ణా వాటర్‌ సరఫరా అవుతుందన్నారు. మిష న్‌ భగీరథ ట్యాంక్‌లను ఇప్పటికి చాలావరకు ప్రారంభం చేయడం జరిగిందన్నారు. 10శాతం పనులు మాత్రమే ఆగిపోయాయన్నారు.

40 ఏండ్ల సమస్యలు పరిష్కరించాం
40ఏండ్లుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు పాస్‌ బుక్స్‌ ఇవ్వడంతో పేద రైతులకు న్యాయం జరిగిందన్న సంతోషం ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
ప్రభుత్వ పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంపై సంతృప్తిగా ఉంది. పేద పిల్లలకు సైన్స్‌ ల్యాబ్‌లు అవసరం, ల్యాబ్‌లు ఉండటం వల్ల కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తారన్న నమ్మకం ఉంది. ప్రభుత్వ పాఠశాలల ను ఆధునీకరిస్తున్నామన్నారు. చెరువులను సుందరీకరణతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనన లక్ష్యం ఉందన్నారు. మీర్‌పేట, జెల్‌పల్లి, జిల్లెలగూడలో ఉన్న చెరువులను సుందరీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles