బంగారు భవిష్యత్తుకు భవిత సెంటర్లు


Wed,December 11, 2019 03:41 AM

-ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత విద్య
-ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో 21 భవిత కేంద్రాల నిర్వహణ - 461 మందికి బోధన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాల్యం.. బంగారు జీవితానికి పునాది.. ఊహాత్మక రంగుల కలలకు చిరునామా.. కాని చెంగు చెంగున పరుగులు పెట్టాల్సిన పిల్లలు మంచానికే పరిమితమవుతున్నారు. చలాకీగా ఉండాల్సిన వారు చతికిలపడిపోతున్నారు. ఇందుకు గల కారణం వారు లోపాలతో పుట్టడమే. ఈ మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో కొంత మంది లోపాలతో పుడుతున్నారు. కొంత మందిలో ఆటిజం, మరికొంత మందిలో బుద్ధిమాంద్యం, ఇంకొందరు ఎదుగుదల లోపాలతో బాధపడుతున్నారు. సాధారణ పిల్లల కంటే భిన్నంగా ఉండే వీరు తల్లిదండ్రులకు భారమవుతున్నారు. వీరికి కొద్దిగా శిక్షణనిప్పిస్తే మార్పులు చూడగలం. అది వేలకు వేలు వెచ్చింది, శిక్షణపొందిన వారి సమక్షంలో మాత్రమే అది సాధ్యం. కానీ పేదవర్గాలకు చెందిన వారు పొట్టకూటికే ఇబ్బందులు పడేవారు ఈ సహసం చేయలేకపోతున్నారు. వేలు..వేలు ఖర్చుచేయలేకపోతున్నారు. ఇలాంటి వారి సంరక్షణ బాధ్యతను సమగ్రశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌ఏ) చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రత్యేకావసరాలు గల పిల్లల కోసం జిల్లాలో భవిత కేంద్రాలను నడుపుతున్నది. జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పిల్లల పాలిట వరంగా మారింది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. జిల్లాలో 461 మందికి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నది.

పెరుగుతున్న విద్యార్థులు
సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ జిల్లాలో భవిత పేరుతో 12 సహితవిద్యా రిసోర్స్ సెంటర్లు (ఐఈఆర్‌సీ) మరో 12 నాన్ ఐఈఆర్‌సీ సెంటర్లను నిర్వహిస్త్తుంది. వీటి కేంద్రంగా నిర్వహిస్తున్న శిక్షణకు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది 461 మంది చేరి ఉచితంగా విద్యాబుద్ధులను నేర్చుకుంటున్నారు. శారీరక ఎదుగుదల కోసం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో కొన్ని మండలాల్లో ఒకటి చొప్పు. మరికొన్ని మండలాల్లో రెండు చొప్పున భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్, అమీర్‌పేట, గోల్కొండ, బహద్దూర్‌పురా, తదితర మండలాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య అధికంగా ఉంది. విద్యార్థుల సంఖ్యను బట్టి వైకల్యం గల పిల్లలంతా ఒకే చోట విద్యనభ్యసించేలా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన టీచర్లు.. ప్రత్యేక బోధనోపకరణాలు.. అందుబాటులో ఉంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

శిక్షణకు మించిన వైద్యం లేదు..
వాస్తవంగా వైకల్యం గల వారికి డాక్టర్లు ఇచ్చే వైద్యం ఎలాంటి ప్రయోజనాలివ్వదు. కానీ క్రమబద్ధమైన శిక్షణ కారణంగా వారిని మార్చగలం. వీరిలో మార్పులను చవిచూడాలంటే శిక్షణకు మంచిన వైద్యం లేదని క్షేత్రస్థాయి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని దవాఖానాలు తిప్పినా.. ఎన్ని మందులు వాడినా నిరుపయోగమని, క్రమబద్ధమైన శిక్షణయే వీరికి ఉపయుక్తంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జీవన నైపుణ్యాలు, కనీస అవసరాలను తీర్చుకోవడంతో తర్పీదునిస్తే కొంత మార్పులు చూడగలం. క్రియాత్మక బోధనాపద్ధతులను ఉపయోగించి వీరి ప్రవర్తనలో మార్పులు గ్రహించవచ్చు. భవిత కేంద్రాల్లోను ఇదే తరహా ప్రయోగాలను అనుసరిస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...