బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రష్ఠవాణి


Tue,December 3, 2019 02:22 AM

-లక్ష డాలర్ల స్కాలర్‌ షిప్‌ సాధించిన భారత యువతి
అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ : ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన వెలొగాంగ్‌ న్యాయ విశ్వవిద్యాలయ స్కాలర్‌షిప్‌ పొందడం గొప్ప విషయమని యూనివర్శిటీ మేనేజర్‌ (ఇంటర్నేషనల్‌ అడ్మిషన్స్‌) పీటర్‌ ముర్రే పేర్కొన్నారు. తాజా విద్యా సంవత్సరానికిగానూ భారత్‌ తరఫున పోటీ పడి లక్ష డాలర్ల స్కాలర్‌షిప్‌ను సాధించిన శ్రష్ఠ వాణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు. సోమవారం బేగంపేట్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో జరిగిన ఓ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన స్కాలర్‌షిప్‌, ఆఫర్‌ లేఖలను పీటర్‌ ముర్రే అందజేశారు. భారత్‌ నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం పోటీ పడగా అందులో శ్రష్ఠ మాత్రమే ఈ ఘనతను సాధించిందన్నారు. అంతర్జాతీయ న్యాయశాస్త్రానికి సంబంధించి రెండు సంవత్సరాల కోర్సును భారత్‌లో పూర్తి చేసిన శ్రష్ఠ, మిగిలిన రెండేళ్ల కోర్సును వెలొగాంగ్‌ విశ్వవిద్యాలయంలోచదువుతుందని తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...