గొల్ల,కురుమల అభివృద్ధ్దికి కృషి


Mon,December 2, 2019 01:08 AM

అమీన్‌పూర్‌:గొల్ల,కురుమ, కులస్తుల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టిందని పశు సంవర్థక,క్రీడలు,సినిమా ట్రోపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.ఆదివారం అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని బీరంగుట్ట బ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జంటనగరాల కురుమ సంఘం,రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె ఎమ్మెల్సీ మల్లేశం ఆధ్వర్యం లో దీపావళి-దసరా సమ్మేళన సభను నిర్వహించారు. ఈ సమ్మేళన సభకు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి శంకర్‌నారాయణ,హిందూపురం ఎంపీ గోరట్ల మాదవ్‌లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్‌ బడగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నా రు. రాష్ట్రంలో గొల్ల కురుమ కులస్తుల సంక్షేమం కోసం 75%సబ్సిడీపై గొర్రెలు అందచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అదేవిధంగా గొల్ల,కురుమల ఐక్యత కోసం ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టేందుకు కోకాపేట్‌లో సుమా రు రూ.28 కోట్లతో పాటు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కురుమ,యాదవ కమ్యూనిటీ భవనాలను నిర్మించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియాపాల్‌ మహాసభల అధ్యక్షు డుసైతాన్‌ సింగ్‌పాల్‌ కురుమ, హిందూపురం ఎంపీ మాధవ్‌,మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కేజీ కృష్ణమూర్తి, పటాన్‌చెరు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుష్పనగేశ్‌ కురుమ,సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు నగేశ్‌ కురుమ,రాష్ట్ర కురుమ సంఘం ప్రతినిధులు,కుల ప్రజాప్రతినిధులు సుమారు 4000 మంది కులస్తులు పాల్గొన్నారు.

ఒగ్గు కళాకారుల ఆటాపాటతో మారుమోగిన సభాస్థలం
కురుమ కులస్థుల సంఘం సమ్మేళనంలో ఆడపడుచులు,పిల్లలు,పెద్దలు బతుకమ్మ,డోల్‌ దెబ్బ,కళాకారుల బృందంతో ఆట పాటలు,పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో పాటు వచ్చిన ప్రజలు వివిధ క్రీడల పోటీలలో పాల్గొని బహమతులను గెలుపొందారు.బతుకమ్మ,బీరప్పకళాకారులచే డోల్‌ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. వివిధ కళారూపాలతో సభా స్థలం మారుమోగింది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...