యువకుడిపై కత్తితో దాడి: తీవ్ర గాయాలు


Mon,December 2, 2019 01:07 AM

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: స్వల్ప వివాదంలో ఓ యు వకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లో ని ఎన్బీటీనగర్‌ ఎస్వీఆర్‌ స్కూల్‌ సమీపంలో ఉంటున్న భాస్కర్‌ (22) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదేబస్తీలో రాకేశ్‌, రూపేశ్‌ అన్నదమ్ములు స్నేహితులు. వీరితోపాటు మరికొందరితో కలిసి అప్పుడప్పుడు మందు పార్టీ చేసుకుంటారు. కాగా శనివారం సాయంత్రం వీరి మధ్య గొడవ జరిగింది. మరోసారి ఆదివారం సాయంత్రం కూడా అందరూ కలిసి మద్యం సేవిస్తు న్న క్రమంలో మరోమారు భాస్కర్‌తో అన్నదమ్ములిద్దరూ గొడ వపడ్డారు. దీంతో రూపేశ్‌ కత్తితో దాడి చేయగా తల, ముఖం, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికు లు భాస్కర్‌ను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో నిందితుల్లో ఒకరిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...