నేటి నుంచే ఇండియా జాయ్..!


Wed,November 20, 2019 01:00 AM

-హెచ్‌ఐసీసీ వేదికగా నాలుగు రోజుల ఈవెంట్
-గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఈ స్పోర్ట్స్ ..
-ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగాల్లో పలు అంశాలపై చర్చా కార్యక్రమాలు
-హాజరుకానున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు
-50 దేశాల నుంచి ప్రతినిధులు
-30 వేల మంది సందర్శకుల రాక

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సినిమాలు చూస్తాం.. సీరియల్స్ వీక్షిస్తాం.. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ సందడి చేస్తాం. కార్టూన్స్ విన్యాసాలకు కేరింతలు కొడుతాం. అంతేకాదు బాహుబలి, సైరా లాంటి సినిమాలలో పోరాట సన్నివేశాలు చూసి ఉద్వేగానికి లోనవుతాం. కానీ ఆ సన్నివేశాలు అంతలా పండటానికి డైరెక్టర్లు, క్రియేటర్స్ ఆలోచనలు ఎంత ప్రధానమో టెక్నాలజీ వినియోగం అంతకంటే ముఖ్యం. మనిషి ఆలోచనకు జీవం పోస్తూ సకల ఎమోషన్స్‌కు గురయ్యేలా విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర అద్భుతం. అది యానిమేషన్ రంగమైనా.. గేమింగ్ రంగంలోనైనా కూడా అంతే. మొత్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో వ్యాపార విస్తరణ, నూతన ఆలోచనలు, ఉపాధి, పెట్టుబడులకు ఆహ్వానం, ఆలోచనల బదిలీకి ఇండియా జాయ్-2019 వారధిగా నిలవనున్నది. ఇందుకు హెచ్‌ఐసీసీ వేదికైనది. తెలంగాణ వీఎఫ్‌ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్(టీవీఏజీఏ) ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నది. నాలుగు రోజుల పాటు జరిగే ఈవెంట్‌కు అంతర్జాతీయ దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు నగరానికి వచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులు గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో గతం, ప్రస్తుతం, భవిష్యత్తు వినియోగంపై చర్చిస్తారు. ఆయా రంగాల్లో సక్సెస్ అయిన వారు తమ అనుభవాలను పంచుకుంటారు. యంగ్‌స్టార్స్‌కు ఇది జ్ఞాన గనిగా మారనున్నది. ఔత్సాహికులకు పలు విషయాలపై అవగాహన రానున్నది. కార్పొరేషన్స్, స్టూడియోస్, కంటెంట్ డెవలపర్స్, డెలిగెట్స్, హార్డ్‌వేర్ తయారీదారులు, వినియోగదారులు హాజరుకాబోతున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్‌పై సమగ్ర చర్చలు..!!
ప్రస్తుతం మనం చూస్తున్న సినిమా, సీరియల్ ఏదైనా విజువల్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే. అయితే వీఎఫెక్ట్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం లభించడం అరుదు. కానీ భారత్‌లోనే మొదటి ప్రత్యేక వీఎఫ్‌ఎక్స్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా జరుగడం విశేషం. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరై ప్రసంగిస్తారు. వీఎఫ్‌ఎక్స్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులపై కూలంకషంగా చర్చిస్తారు. ఎక్స్‌క్లూసివ్ వీఎఫ్‌ఎక్స్ అవార్డ్స్ ఉండనున్నాయి. పలు అంశాలపై వర్క్‌షాపులు నిర్వహిస్తారు. కస్టమర్, వ్యాపారి, బి2బీ మధ్య సయోధ్య కుదుర్చుకునే అవకాశం వస్తుంది. వీఎఫ్‌ఎక్స్ ఇండస్ట్రీకి సంబంధించి మిల్ ఫిల్మ్ హెడ్ ఆఫ్ క్రియేటివ్ ఆపరేషన్స్ పాయల్ దని, కంట్రీ హెడ్ ఇన్ ఇండియా ఫర్ టెక్నికాలర్ బిరెన్ ఘోస్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైసర్ డైరెక్టర్ టీమ్ ఎంసీగవర్న్, రియోట్ గేమ్స్ వీఎఫ్‌ఎక్స్ సీనియర్ ఆర్టిస్ట్ జాసన్ కీసర్, వీఎఫ్‌ఎక్స్ లెజెడ్ సూపర్‌వైజర్ మంగేశ్ పల్క్రిత్ తదితర దిగ్గజ కంపెనీల ప్రముఖులు పాల్గొంటారు. వీఎఫ్‌ఎక్స్ పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తు ఆన్ ఇండియన్ స్టోరీ టాపిక్‌పై వక్తలు ప్రసంగిస్తారు. ప్రివిజువలైజేషన్ ప్రాముఖ్యత, ఒరిజినల్ కంటెంట్, మిషైన్ లెర్నింగ్, మోడర్న్ రియల్ టైమ్ ఇన్ వీఎఫ్‌ఎక్స్, వీఎఫ్‌ఎక్స్‌లో సాంకేతికత ఆవిష్కరణలు తదితర చర్చాకార్యక్రమాలు జరుగనున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈవెంట్
ఐటీ పరంగా హైదరాబాద్ పేరు విశ్వవ్యాప్తమైనది. నగరంలో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. వారికి అవకాశం ఉంది. అయితే తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్(టీవీఏజీఏ) ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా విద్యార్థులను ట్రైయిన్ చేయడం, విద్యాసంస్థలకు అప్‌డేట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం చేస్తాం. ఇనార్జిట్‌మాల్ దగ్గర ఇమెజ్ టవర్ ప్రభుత్వం నిర్మిస్తున్నది. యానిమేషన్‌కు ఇది ల్యాండ్‌మార్క్ బిల్డింగ్ కానున్నది. దీంతో చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇలాంటి ఈవెంట్స్ జరుపడం వల్ల మన ఇండస్ట్రీకి బలాన్నిస్తాయి. ఈసారి గతంలో కన్నా ఎక్కువ గెస్టులు వస్తున్నారు. మరో రెండేండ్లలో ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబోతున్నది. ఇదంతా ప్రభుత్వం ప్రోత్సాహంతోనే సాధ్యమైంది.
- రాజీవ్ చిలక, చోటభీం సృష్టికర్త,
గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ.

సినీ జ్ఞానం పొందాల్సిందే..!!
సినీ నిపుణులు ఒకే వేదిక వద్దకు వస్తారు. ఆలోచనల బదిలీకి అవకాశం దొరుకుతుంది. వ్యాపార విషయాలు మాట్లాడుకునే వీలుంటుంది. ప్రస్తుతం మోడర్న్ ట్రెండ్స్‌లో వస్తున్న మార్పులపై అర్థవంతమైన చర్యలు సాగుతాయి. గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి అంశం చర్చకు వస్తుండడం విశేషం. అంతేకాదు టీవీ నటులు, సినిమా నటులు అందరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. పలు అవార్డు ఫంక్షన్లు జరుగుతాయి. ఫిల్మ్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్, కో ప్రొడక్షన్, ఫినాన్సింగ్ విషయాలపై చర్చిస్తారు. భవిష్యత్తులో ఫిల్మ్ ప్రాజెక్టులకు వినియోగించబోయే సాంకేతికత, బడ్జెట్ ఎలా ఉండబోతుందనే అంశాలను తెలుసుకునే వీలు లభిస్తుంది. మొత్తంగా సినీ ప్రపంచం ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? తదితర ప్రతి విషయంపై అవగాహన రానున్నది. సినిమాలను నిర్మించడంపై చర్చిస్తారు. ప్రముఖ దర్శకులు హాజరవుతారు. రైటర్స్‌కు సూచనలు చేస్తారు.

బొమ్మ గీద్దాం.. బహుమతి పొందుదాం..!!
ఇండియా జాయ్‌లో భాగంగా మూడు రోజుల పాటు ట్రెడిషనల్ అండ్ డిజిటల్ ఆర్ట్ కాంపిటేషన్ ఉండనున్నది. పెన్సిల్, కంప్యూటర్.. ఎలాంటి టూల్ వాడినా సరే. వయసుతో సంబంధం లేకుండా ఆర్ట్ కాంపిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 15 కేటగిరీలు, 15 థీమ్స్‌పై పెయింటింగ్ ఉంటుంది. ఫేస్ పెయింటింగ్, స్కెచింగ్, ఫొటోగ్రఫీ, కాస్‌ఫ్లే, ట్రెడిషనల్ పెయింటింగ్, ఒరిగమీ, డిజిటల్ కాన్సెప్ట్ ఆర్ట్, త్రీడీ లైటింగ్, 3డీ యానిమేషన్ తదితర కెటగిరీలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ఇస్తారు. ప్రతి రోజు సాయంత్రం మ్యూజిక్ ఫెస్టివల్ ఉంటుంది. కొత్త వారిని ప్రోత్సహించడంలో భాగంగా యంగ్‌స్టర్స్ సంగీతంతో ఆకట్టుకోనున్నారు.

స్మార్ట్‌ఫోన్ గేమ్స్ వెనుక క్రియేటివిటీ..!!
ఇండియా జాయ్‌లో ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ జరుగనున్నది. ఇందులో గేమింగ్ డెవలపర్స్ పాల్గొంటారు. స్మార్ట్‌ఫోన్లలో మనం ఆడుతున్న గేమ్స్‌ను ఎవరు సృష్టించారో చాలా మందికి తెలియదు. అయితే అందులో కొన్ని గేమ్స్‌ను ఆవిష్కరించిన కంపెనీలు ఈవెంట్‌కు రానున్నాయి. టెంపుల్న్,్ర పజిల్ గేమ్ తదితర ఆటల ఆవిష్కృతులు వస్తున్నారు. వారి విలువైన సూచనలు యంగ్‌స్టార్స్‌కు ఉపయోగపడనున్నాయి. అంతేకాదు ఆకుట్టకునే గేమ్ ఆలోచన ఉంటే షేర్ చేసుకునే వీలు దక్కుతుంది. వారికి నచ్చితే ఎలా డెవలప్ చేయాలో సూచనలు చేస్తారు. అవరసమైతే పెట్టుబడులు లభించే వీలుంటుంది. అంతేకాదు చోటాబీమ్ సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకతో పాటు కబమ్ గేమ్స్ సీఈఓ టిమ్ ఫీల్డ్స్, టెన్సెంట్ గేమ్స్ జీఎం అనీష్ అవరింద్, గూగుల్ ప్లే బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ శరన్ తుల్సియానీ, గూగుల్ ఇండస్ట్రీ హెడ్ గేమింగ్ శాలు జుంజున్వాలాలు పాల్గొని తమ వ్యాపార ఆలోచనలను పంచుకుంటారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...