జీవీకా పరిశ్రమకు అనుమతులు లేవు


Wed,November 20, 2019 12:54 AM

జీడిమెట్ల : జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌వీసీఐఈ సర్వీస్ సొసైటీ పరిధిలో ఉన్న జీవీకా లైఫ్ సైన్స్‌స్ కెమికల్ కం పెనీకి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జీవీకా లైఫ్ సైన్స్‌స్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారీ విస్ఫోటనం కారణంగా పలు కంపెనీల్లో విధ్వంసం సృష్టించింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మంగళవారం వెళితే పరిశ్రమకు తాళం వేసి ఉందన్నారు. బుధవారం పరిశీలించి మూసివేత నోటీస్‌ను.. నిర్వాహకులకు అందజేస్తామన్నారు.

ఇంకా వెలువడుతున్న రసాయనిక పొగలు
జీవీకా లైఫ్ సైన్స్‌స్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా రసాయనిక పొగలు, ఘా టైన వాసనలు వెలువడుతూనే ఉన్నాయి. కంపెనీలో 8 రియాక్టర్లు ఉండగా.. ఒక్క రియాక్టర్‌లో రసాయన మిశ్రమాన్ని కలుపుతుండగా ఉష్ణోగ్రతలు పెరిగి ఒత్తిడికి గురై రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం కూడా ప్రమాదం జరిగిన స్థలం నుంచి విషవాయువులు వెలువడుతూనే ఉన్నాయి. దీంతో చుట్టూ ఉన్న కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...