దాహార్తి తీర్చాలంటూ 3కే రన్


Mon,November 18, 2019 04:51 AM

-ఆరేండ్ల్లుగా విన్నవిస్తున్నా కాలయాపన చేస్తున్నారంటూ అల్కాపూర్‌వాసుల ఆవేదన
-జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాంటూ వినతి
-రన్‌లో పాల్గొన్న 1500మంది కాలనీవాసులు, నాయకులు
మణికొండ, నమస్తే తెలంగాణ: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గడిచిన ఆరేండ్లుగా జలమండలి అధికారులకు విన్నవించినా స్పందించడంలేదంటూ ఆదివారం అల్కాపూర్ టౌన్‌షిఫ్‌వాసులు రన్ ఫర్ సేఫ్ వాటర్ పేరిట 3కే రన్‌ను నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిఫ్‌లో సుమారు 2వేల పైచీలుకు కుటుంబాలు నివాసముంటున్నాయ ని, తాగునీటి సమస్యలతో కొన్నాళ్లుగా సతమతమౌతున్నామంటూ జలమండలి ఉన్నతాధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధి మనోజ్‌కుమార్ తెలిపారు. తాగునీటి కోసం గతంలో హుమన్ చైన్ ఫార్మెషన్, మౌనదీక్ష, పేరిట నిరసనలు చేపట్టామన్నారు. ఆదివారం రన్ ఫర్ సేఫ్ వాటర్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందుకు స్థానిక ప్రజల నుంచి విశేషమైన స్పం దన వచ్చిందని తెలిపారు. జలమండలి అధికారులు ఇప్పటికైనా ప్రజాసమస్యలను పరిష్కరించేలా చర్యలు వేగవంతం చేయాలని విన్నవించారు. అల్కాపూర్ కాలనీ నుంచి సుమారు ప్రతిఏటా రెండుకోట్ల పన్నులను చెల్లిస్తున్నామని, పాలకులు తమ సమస్యలపై పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వేలాదిమంది స్థానికులు, పిల్లలు సైతం రోడ్డెక్కి తాగునీటి కోసం వేడుకుంటున్నా పాలకుల స్పందన లేకపోవడంపై పలువురు మండిపడ్డారు. ఎన్నిసార్లు జలమండలి అధికారులకు కలిసి విన్నవించినా ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారని చెబుతున్నారే తప్ప ఆరేండ్లు గా ఒకేమాటతో కాలయాపన చేస్తున్నారని అల్కాపూర్ టౌన్‌షిఫ్ కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...