సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో బంగారు లక్ష్మణ్ ట్రస్ట్, వ్రిశాంక్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆల్ ఇండియా డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జాతీయ స్థాయి సంగీత, నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒరిస్సా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలతో పాటు ఆయాప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తమప్రతిభ పాటవాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సురేష్, వైస్ ప్రెసిడెంట్ సాయి శ్రియ, జనరల్ సెక్రటరీ భానుప్రియ, సాయి ప్రసా ద్ తదితరులు పాల్గొన్నారు. -మారేడ్పల్లి