కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి


Sun,November 17, 2019 03:12 AM

కాచిగూడ,నవంబర్ 16: దేశ వ్యాప్తంగా ఉన్న కో-ఆపరేటివ్ సొసైటీలకు కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, స్వయం ప్రతిపత్తిని కల్పించాలని ముద్ర అగ్రికల్చరల్ అం డ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు కోరా రు. ఢిల్లీలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న 66వ జాతీయ సహకార వారోత్సవాల్లో తెలంగాణ తరపున తిప్పినేని రామదాసప్ప నాయుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ప్రపంచం చూపు-పొదుపు వైపుఅనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రివర్యులు సంతోశ్ గంగ్వార్ హాజరై తెలంగాణ తరుపున ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో-అపరేటివ్ సొసైటీ సహకారంతో వ్యాస రచన పోటీల్లో పాల్గొన్న సభ్యురాలు మంచాల శ్రీనివాస్, జె.పద్మజలకు కేంద్ర మంత్రి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శనివారం బర్కత్‌పురలోని కార్యాలయంలో రామదాసప్ప నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీయూఐ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు చంద్రపాల్ యాదవ్, సీఈవో సత్యనారాయణతో పాటు వివిధ రాష్ర్టాల సహకార రంగ ప్రముఖులు పాలొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles