రోడ్డు తవ్వకాలు పూర్తిగా నిషేధం


Sun,November 17, 2019 03:06 AM

ఒకవేళ ఎవరైనా రోడ్డు తవ్వకానికి దరఖాస్తు చేసుకుంటే రోడ్డు వెంబడి గ్రీనరీలో మాత్రమే పరిమిత విస్తీర్ణం వరకు మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అక్కడ సైతం పూర్తిగా ట్రెంచ్‌లెస్ విధానాన్నే అనుసరిస్తున్నారు. వాహనాలు వెళ్లే బీటీ రోడ్డునైతే ముట్టుకునే అవసరమే ఉండదు. రోడ్డు తవ్వకం పూర్తిగా నిషేధం. ప్రధానమంత్రి సహా అనేకమంది వీవీఐపీలు నిత్యం సంచరించే రోడ్లు అయినందున వాటి నిర్వహణ 24 గంటలూ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక పారిశుధ్యం విషయానికొస్తే, అక్కడ ఎంతో మెరుగ్గా ఉందని అధికారులు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్లు, ఏటీఎంలు, వాటర్ ఏటీఎంలు తదితర అన్నీ ఒకే కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసి పూర్తిగా ప్రైవేటు యాడ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే, బస్ షెల్టర్ల ఏర్పాటు, నిర్వహణ కూడా యాడ్ ఏజెన్సీలే నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, విద్యుత్ సరఫరాకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర కేబుళ్లన్నీ ఒక విశాలమైన జంక్షన్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కడా మనకు విద్యుత్‌కు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై కానరావని అధికారులు తెలిపారు. దీనివల్ల ఫుట్‌పాత్‌లపై ఏ విధమైన అడ్డంకులూ ఉండవు.

పర్మినెంటు కార్మికులతో..
పర్మినెంట్ కార్మికులను ఏర్పాటుచేసే విధానం మన నగరంలో అమలుచేయవచ్చని, దీంతో గుంటల పూడ్చివేత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు చెప్పారు. రోడ్డు తవ్వకాలను నివారించేందుకు కూడా కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు. రోడ్డు తవ్వకాలను నివారిస్తే నిర్వహించాల్సిన అవసరం చాలావరకు తగ్గుతుందని, ఇక వర్షపునీరు వెళ్లేందుకు రోడ్డుకు ఇరువైపులా డెయిన్‌లు ఉంటే రోడ్లు పాడుకావడం దాదాపు ఉండదన్నారు. బస్ షెల్టర్లు, టాయిలెట్ల నిర్వహణ, రోడ్ల మరమ్మతులకు పర్మినెంటు కార్మికుల ఏర్పాటు తదితర చర్యలు మన నగరంలో అమలుచేసేందుకు ఆస్కారం ఉందని వివరించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles