నిర్మాణ వ్యర్థాల తరలింపునకు..20 నుంచి డ్రైవ్


Sat,November 16, 2019 03:05 AM

-దూలపల్లిలో వ్యక్తికి రూ.2.5 లక్షల జరిమానా
పేట్‌బషీరాబాద్ : కొంపల్లి పురపాలక సంఘం పరిధిలో నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై మున్సిపల్ కమిషనర్ ఎంఎన్‌ఆర్ జ్యోతి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో సాధారణ జరిమానా విధించిన అధికారులు కాస్త నిబంధనలు పా టించేలా చేశారు. కానీ కొందరు పట్టించుకోవడంలేదని గ్రహించిన అధికారులు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దూలపల్లి సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బహిరంగ ప్రదేశంలో ఇండ్ల నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేసిన బర్మ అశోక్‌తోపాటు అతని సోదరులకు ఏకంగా రూ.2.5లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోవడంతో అక్కడున్న వారి నిర్మాణానికి నోటీసులు అంటించారు. కొంపల్లిలో ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎంఎన్‌ఆర్ జ్యోతి మాట్లాడుతూ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే 7997994231 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని, మీ వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది శ్రీహరి, నందకుమార్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles