నేర నియంత్రణలో నంబర్‌వన్


Sat,November 16, 2019 02:51 AM

బోడుప్పల్: నేర నియంత్రణలో, శాంతి భద్రత పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని, ఫ్రెండ్లీ పోలీసు విధానం, మానవీయ కోణంలో చేస్తున్న ప్రజాసేవ ప్రజలకు మరింత దగ్గర చేసిందని కొనియాడారు. 56ఎకరాల్లో నిర్మించ నున్న రాచకొండ కమిషనరేట్ దేశానికే తలమానికం అవుతుందన్నారు. భాగ్యనగరానికి తూర్పు దిశలో వెలియనున్న రాచకొండ కమిషనరేట్‌ను అత్యాధునిక హంగులతో దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మిస్తామని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైనా ఖర్చుచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రూ. 2.5కోట్లతో ముందు ప్రహరీ నిర్మాణం పూర్తిచేసి భవన నిర్మాణాలు మొదలుపెడుతామని తెలిపారు. 5091 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 40 లక్షల జనాభా, 44 పోలీసు స్టేషన్లను అనుసంధానం చేసుకుంటూ ఈ కమిషనరేట్ పనిచేస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.అలాగే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో 30 ఎకరాల్లో హెడ్‌క్వార్టర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2వేల పైచిలుకు మంది బాలకార్మికులకు విముక్తి కలిగించడంలో తెలంగాణ పోలీసుల కృషిని సీపీ మహేశ్ భగవత్ కొనియాడారు. అంతేకాకుండా 25వందల మందికి విద్యను అభ్యసించడానికి కోటి రూపాయలు ఖర్చుచేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో 588మంది పోలీసు కానిస్టేబుల్‌గా, 37మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుగా, 60మంది వీఆర్‌ఓలుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ భవన నిర్మాణ సముదాయానికి కేంద్రం నుండి నిధులు తెచ్చి తన వంతు కృషిచేస్తానని ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీసీ టీవీ కమాండ్ సెంటర్‌ను శుక్రవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సందర్శించి పరిశీలించారు. శనివారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కమాండ్‌సెంటర్‌ను హోంమంత్రి సందర్శించగా పోలీసు అధికారులు సీసీ టీవీ పనితీరును వివరించారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు ఈ సెంటర్‌ను అనుసంధానం చేసినట్లు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను ఇక్కడి నుండి ప్రత్యక్షంగా తిలకించవచ్చని అన్నారు. హోంమంత్రితో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, స్థానిక సీఐ రఘువీర్‌రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles