రెసిడెన్షియల్ ప్లాట్లకు గజానికి రూ.30 వేలు


Sat,November 16, 2019 02:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ -వేలం ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే నెల 11వ తేదీ వరకు బిల్డర్ల (కొనుగోలుదారుల) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నామని, ఈ-వేలంను 14, 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నామని హెచ్‌ఎండీఏ సెక్రటరీ రాంకిషన్ తెలిపారు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 1000 ఖరారు చేయగా, అదనంగా 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 138 ప్లాట్లకు గాను (1, 76, 330 స్కేర్ యార్ట్స్) స్థలానికి గానూ ఈ-వేలం నిర్వహించనున్నారు. ఎంఎస్‌టీసీ సంస్థ సమన్వయంతో వేలం ప్రక్రియలో 200 గజాల స్థలం నుంచి మూడున్నర ఎకరాల మేర వరకు ప్లాట్లు వేలానికి పెట్టారు. అయితే రెసిడెన్షియల్ జోన్‌లో ఉన్న ప్లాట్లకు సంబంధించి గజానికి రూ. 30 వేలు (అప్‌సెట్) ఖరా రు చేయగా, కమర్షియల్ ప్లాట్లకు రూ. 40 వేలు ధర నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్‌లో రియల్ డిమాండ్ ఉండడం, గతంలో అత్యధికంగా గజం ధర రూ. 73, 900గా పలకడం దృష్ట్యా ఈ సారి కమర్షియల్, రెసిడెన్షియల్, మల్టీ పర్సస్ ప్లాట్లు ఉండడంతో వీటికి అత్యధికంగా డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రధానంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కనే మెట్రోరైల్, వరంగల్ జాతీయ రహదారి దగ్గరగా ఉండడం ఈ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, తాజా ఈ -వేలం ద్వారా రూ. 950కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తు న్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles