సొంతింటి సంబురం


Fri,November 15, 2019 04:35 AM

-108 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు బస్తీవాసులకు అందజేత
-సామూహిక గృహప్రవేశాలు చేయించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, మేయర్ బొంతు, ఎమ్మెల్యే మాధవరం
-ఆనందంలో మునిగితేలిన లబ్ధిదారులు
-గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు 20 దుకాణాలు
-వాటి ఆదాయంతో నెలనెలా ఇండ్ల సముదాయ నిర్వహణ
-సముదాయంలో.. లిఫ్ట్, పార్కింగ్ సౌకర్యాలు
-కూకట్‌పల్లిలో రెండు ఇండోర్ స్టేడియాలు
-81 స్టాళ్లతో చేపల మార్కెట్ ప్రారంభం
-83కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన

కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌లో రూ.83కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో రైల్వే పట్టాలపై వంతెన నిర్మాణానికి రూ.18.06కోట్లు రైల్వేకి కేటాయించగా, రెండువైపులా అప్రోచ్‌ల నిర్మాణానికి రూ.40కోట్లు, అలాగే భూసేకరణకు రూ. 25కోట్లు కేటాయించారు. 676 మీటర్ల పొడవైన ఈ ఆర్‌ఓబీ 16.61 మీటర్ల వెడల్పు ఉంటుంది. నాలుగు లేన్ల ఈ ఆర్‌ఓబీపై రాకపోకలు సాగించే విధంగా డిజైన్‌చేశారు. ఈ ఆర్వోబీ కూకట్‌పల్లి నుంచి హైటెక్‌సిటీకి ప్రత్యామ్నాయ రోడ్డుగా ఉపయోగపడుతుంది. అలాగే, దీనివల్ల జేఎన్‌టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్‌షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ైఫ్లెఓవర్, సైబర్ టవర్ జంక్షన్ తదితరచోట్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలనుంచి వచ్చే ట్రాఫిక్‌ను మూసాపేట్ వద్ద కైత్లాపూర్ వైపుగుండా మళ్లించి మాదాపూర్ మెయిన్‌రోడ్డుకు కలుపుతారు. అలాగే, సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు 3.50 కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది.

ఆధునిక ఫిష్ మార్కెట్ ప్రారంభం
కూకట్‌పల్లిలో రూ. 2.78కోట్లతో నిర్మించిన హోల్‌సేల్ మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1651చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మార్కెట్ నిర్మాణానికి జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ రూ.2.25 కోట్లు అందించగా, జీహెచ్‌ఎంసీ రూ.53.20లక్షలు ఖర్చుచేసింది. మొత్తం 81ఫిష్ స్టాల్స్ ఉన్న ఈ మార్కెట్‌లో రెండు హోల్‌సేల్ స్టాల్స్, ఆరు డ్రై ఫిష్ స్టాల్స్, ఒక ఫుడ్‌కోర్టు నిర్మించారు. మత్స్యకారులు, ఈ వృత్తిలో ఉన్న ముదిరాజ్‌ల వ్యాపారాభివృద్ధికి ఈ మార్కెట్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles