ట్రేడ్ లైసెన్సు ఫీజుల సవరణకు స్థాయీసంఘం ఆమోదం


Fri,November 15, 2019 04:29 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ పరిథిలోని ట్రేడ్ లైసెన్సు ఫీజులను సవరిస్తూ బల్దియా స్థాయీ సంఘం తీర్మానించింది. గతంలో స్లాబ్ విధానం ఉండగా, తాజాగా దుకాణ విస్తీర్ణం, అందులో జరుగుతున్న వ్యాపారం ఆధారంగా ఫీజు వసూలు చేస్తారు. ఈ మేరకు గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థాయీసంఘం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 30మంది జూనియర్ ఎనలిస్టుల సేవలను వచ్చే ఏడాది సెప్టెబర్ వరకు పొడిగించారు. అలాగే, 3142మంది బల్దియా శాశ్వత ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి రూ. 3,71, 54,150ప్రీమియం మొత్తాన్ని చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. 17మంది సహాయక ఎంటమాలజిస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వచ్చే ఏడాది జనవరి 1నుంచి డిసెంబర్ 31వరకు నియమించాలని తీర్మానించారు. మున్సిపల్ మార్కెట్లలో దుకాణాలను ప్రతి వంద షాపుల్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు ఆరు, వికలాంగులకు మూడు, ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు 10,నాయీ బ్రాహ్మణులకు ఐదు, జనరల్ కోటాలో 61కేటాయించాలని తీర్మానించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...