ఘనంగా గురుపూజోత్సవం, అష్టావధానం


Fri,November 15, 2019 04:27 AM

ఉస్మానియా యూనివర్సిటీ : కాళిదాసు జయంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో గురువారం ఘనంగా గురుపూజోత్సవం, అష్టావధానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం మాట్లాడుతూ.. మనదేశంలో ప్రతీ ఏటా కార్తీక పౌర్ణమి రోజున కాళిదాసు జయంతి నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి మహామహోపాధ్యాయ పురస్కారం పొందిన నల్లగొండ పురుషోత్తమ శర్మ, తిగుళ్ల హరిశర్మలను ఘనంగా సన్మా నించారు. అనంతరం అష్టావధాన కార్యక్రమాన్ని గౌరీభట్ల వెంకట్రామశర్మ నిర్వహించారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...