స్కూల్ పిల్లలే టీవీ చానల్ నిర్వాహకులు


Thu,November 14, 2019 04:26 AM

-చిన్నారుల ప్రతిభకు పదును పెట్టేందుక యూత్ ప్రెస్ పేరుతో చానల్
-కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన ఓ పాఠశాల

సిటీబ్యూరో/ఖైరతాబాద్, నమస్తే తెలంగాణ : వెల్ కమ్ టు అవర్ చానల్ అంటూ చిన్నారులు ఓ ప్రత్యేకమైన ప్రసార మాధ్యమంతో పలుకరించనున్నారు. తొమ్మిది నుంచి 15 ఏండ్ల వయస్సులో ఉన్న పిల్లలు నేటి నుంచి స్క్రిఫ్ట్ రచయితలుగా, కెమెరామెన్లుగా, న్యూస్ ఎడిటర్లు, ప్రొడ్యూసర్లుగా తమ ప్రతిభను చాటుకుంటారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు మండలంలోని సమష్టి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లల కోసం పిల్లల నిర్వహణలో నడిచే ది యూత్ ప్రెస్ పేరుతో టీవీ చానల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ముంబైకి చెందిన పిక్చర్ పాఠశాల సంస్థ సహకారంతో నేడు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సమష్టి మీడియా ల్యాబ్ పేరుతో చిన్నారుల చానల్‌ను ప్రారంభిస్తున్నారు.

ఆ విశేషాలను విద్యార్థులు లాస్య, సిద్ధార్థ, ప్రణయ్, దివ్యాంశ్, శాన్వీ, సోనాలీలు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో పంచుకున్నారు. నిత్యం ప్రపంచంలో జరుగుతున్న వివరాలు, అంశాలను టీవీ చానళ్లలో చూస్తుంటామని, తామూ కూడా పిల్లలకు సంబంధించిన అంశాలతోపాటు విజ్ఞాన విషయాలను అందరితో పంచుకునేందుకు ఈ చానల్ ఓ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ చానల్‌లో ప్రసారం చేసే స్క్రిప్టు సిద్ధం చేసుకొని అవసరమైన వద్ద కెమెరాతో షూట్ చేసి ప్రసారం చేస్తామన్నారు.

పిక్చర్ పాఠశాల సహకారంతో...
ముంబైలో పిల్లల సాధికారతపై కొనసాగుతున్న పిక్చర్ పాఠశాల, ది యూత్ ప్రెస్ చానల్‌కు కావాల్సిన టెక్నికల్, రచన, దర్శకత్వం, మీడియాకు కావాల్సిన అనేక ఇతర వృత్తి నైపుణ్య విషయాలను నేర్పించేందుకు కృషి చేస్తుంది. పిక్చర్ పాఠశాల ఇప్పటికే ముంబైలో తన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థ చిన్నారులతో వారి కళను వెలికితీస్తూ వారిలోని టాలెంట్‌ను నిరూపించింది. ఇదే పద్ధతిలో మన దగ్గర కూడా చిన్నారుల్లోని టాలెంట్‌ను వెలికి తీయడం కోసం పిక్చర్ పాఠశాల ఎంతో కృషి చేస్తుంది. పిక్చర్ పాఠశాల నుంచి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న శ్వేతా పరాఖ్ కూడా 13 ఏండ్ల వయసులోనే తన స్కూల్‌లో టీవీ చానల్ నడిపి లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా చిన్నారులతో 200లకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...