మానసిక చికిత్సాలయానికి ప్లేట్లు అందజేత


Thu,November 14, 2019 04:17 AM

అమీర్‌పేట్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ):సనత్‌నగర్ మోడల్‌కాలనీకి చెందిన మానవ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఎనిమిది మంది దాతలచే రూ. 52వేలు వెచ్చించి కొనుగోలు చేసిన 375 భోజన ప్లేట్లను బుధవారం ఉదయం ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయ పరిపాలనా విభాగంలో వైద్యాధికారులకు అందజేశారు. మానసిక చికిత్సాలయం లో రోగులకు సదుపాయాలు బాగానే ఉంటున్నా రోగులకు సహాయకులుగా ఉంటున్న వారికి ఆసుపత్రి బయట ఇబ్బందులు ఉంటున్నాయని, ప్రతి రోజూ వందల సంఖ్యలో అటెండెంట్లు భోజన సమయాల్లో ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని మానవ సేవా ట్రస్టు చొరవతో 8 మంది దాతలతో 375 ప్లేట్లు కొనుగోలు చేసి చికిత్సాలయ యాజమాన్యం ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులుడి. బుచ్చిబాబు తెలిపారు. మైనేని నీరజా కల్యా ణ్, గుడిపాటి నీతా శ్రీనివాసన్, ఇనగింటి శ్రీనివాస్‌రావు, గుంటుపల్లి సాయి గౌతమ్, ఎం.గోవర్ధన్‌రావు, అవరు జ్ఞానేశ్వర్, కనుమూరి వెంటక కృష్ణంరాజు తదితరుల చేయూతతో భోజన సమయాల్లో రోగుల సహాయకులకు ప్లేట్ల బెడద తప్పిందన్నారు. మానవ సేవా ట్రస్ట్ తరపున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో రోగుల సహాయకులకు దాతల చేయూతతో ఉచిత భోజన శిబిరాలు తరుచూ ఏర్పాటు చేస్తుంటామని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ పవార్, హెచ్‌వోడీ డాక్టర్ రామసుబ్బారెడ్డి,డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్ట ర్ రాజశేఖర్, డైటీషియన్ ఎస్.రమేశ్ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...