లబ్ధిదారులకు డబుల్ గృహాలు


Thu,November 14, 2019 04:17 AM

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 9800 ఇన్‌సిటూ (బస్తీవాసులకు అదే స్థలంలో కట్టించే గృహాలు) ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తయింద న్నారు. వీటితోపాటు దాదాపు 45000 గృహాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని, అయితే వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి వుందని, అలాగే, లబ్ధిదారుల ఎంపిక కూడా చేయాల్సి వుందని చెప్పారు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ పూర్తయిన ఇండ్లనన్నింటినీ పంపిణీచేస్తామన్నారు. ఇన్‌సిటూ ఇండ్ల లబ్దిదారుల గుర్తింపు ఇదివరకే పూర్తయినందున వాటి పంపిణీలో ఇబ్బందులు లేవ న్నారు. గతంలో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం, వాంబే గృహాలను కూడా త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నగరంలోని 27 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఇక 24 గంటలూ పారిశుధ్య పనులు నిర్వహించేందుకు వీలుగా ఆ విధులను ఒకటి-రెండు నెలల్లో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇప్పటికే రెండుచోట్ల ప్రయోగాత్మకంగా ఏజెన్సీలకు పనులు అప్పజెప్పామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ ప్రాజక్టుల కోసం రూ. 285నుంచి 300కోట్ల వరకు భూసేకరణకు వెచ్చించినట్లు చెప్పారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...