విశాల శూన్యం కవితా సంపుటి ఆవిష్కరణ


Thu,November 14, 2019 04:15 AM

త్యాగరాయగానసభ : పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ రచన విశాల శూన్యం కవితాసంపుటిని సభ గానసభలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్విక భావనల కలబోత ఇనాక్ విశాల శూన్యం కవిత్వమని అన్నారు. పద్మశ్రీ ఇనాక్ తాత్విక చింతన , దళిత తాత్వికత సార్వజనీనత కలిగి ఉందన్నారు. సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇనాక్ రాసింది రత్నమైందని, చెప్పింది చైతన్యమైందన్నారు. కోటవెలుపల బిచ్చగత్తె కవిత్వం -అని ఓ కవితలో పేర్కొన్నారన్నారు. కార్యక్రమంలో ఇనాక్‌తోపాటు డా. ఎంకే రాము, డా.బొమ్మగాని శ్రీకృష్ణమూర్తి, బిక్కికృష్ణ, జల్దివిద్యాధరరావు, లక్కరాజు నిర్మల, జనార్దనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...