గవర్నర్‌ను కలిసిన వికలాంగుల హక్కుల ప్రతినిధులు


Tue,November 12, 2019 02:03 AM

అడ్డగుట్ట, నవంబర్ 11 : రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టాలు అమలయ్యేల చూడాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో వికలాంగులు సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గవర్నర్ కోటలో వికలాంగులకు ఎమ్మెల్సీ వచ్చేల చూడాలని, రాష్ట్రంలో వికలాంగుడినే కమిషనర్‌గా నియమించాలని కోరినట్లు తెలిపారు. అన్ని సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని కోరారు. అదే విధంగా డిసెంబర్ 3వ తేదీన నెక్లెస్ రోడ్డులో జరిగే వికలాంగుల అవేర్‌నెస్ వాక్‌కు హాజరుకావాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పద్మశాలి, వీఆర్. శ్రీనివాస్, గోపాల్. వీరన్న, నరేశ్, రాజు తదితరులు ఉన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...